బెంగళూరులో దారుణం.. స్కూటీతో పాటు వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన యువకుడు

Bengaluru: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

Update: 2023-01-17 14:15 GMT

బెంగళూరులో దారుణం.. స్కూటీతో పాటు వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన యువకుడు 

Bengaluru: కర్నాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. ఓ యువకుడు తాను చేసిన యాక్సిడెంట్ నుంచి తప్పించుకునేందుకు ఓ వృద్ధుడిని స్కూటీతో పాటు కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. దీంతో ఆ రోడ్డులో వెళ్తున్న వాహనదారులు ఇది గమనించి కేకలు వేసినా యువకుడు పట్టించుకోలేదు. దీంతో తమ వాహనాలను అడ్డుపెట్టి స్కూటీని ఆపేశారు. బెంగళూరులోని మగది రోడ్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకోగా..సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. గాయపడిన వృద్ధుడిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News