Coron Cases in India: భారత్ లో కొత్తగా 80,834 కరోనా కేసులు
Coron Cases in India: వరుసగా రెండో రోజు 90 వేలకు దిగువన పాజిటివ్ కేసులు
Coron Cases in India: దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. వరుసగా రెండో రోజు 90 వేల దిగువన పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 80 వేల 834 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో గత 71 రోజుల కనిష్టానికి కేసుల సంఖ్య చేరుకుంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 94 లక్షలు దాటింది. కోవిడ్ నుంచి కోలుకుని లక్ష 32 వేల మందికి పైగా బాధితులు డిశ్చార్జీ అయినట్టు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెవ్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 10 లక్షకు చేరుకున్నాయి.
ఒకవైపు కరోనా కేసులు తగ్గుతున్నా మరణాలు మాత్రం తగ్గడం లేదు. ఇది కాస్త ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24గంటల్లో 3వేల 3వంద 3 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మృతుల సంఖ్య 3లక్షల 70వేలకు చేరింది. టీకా డ్రైవ్ లో భాగంగా ఇప్పటి వరకు 25కోట్ల మందికి డోసులు పంపిణీ చేసినట్టు కేంద్రం వివరించింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 95.26శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 5శాతానికి దిగువన పడిపోయిందని పేర్కొంది. మరణాల రేటు 1.26శాతం మాత్రమే ఉందని పేర్కొంది. ప్రస్తుతం 4.74శాతంగా ఉందని, రోజు వారి పాజిటివిటీ రేటు 4.25 శాతంగా ఉందని.. ఇది వరుసగా 20వ రోజు పది కన్నా తక్కువగా ఉందని కేంద్రం తెలిపింది.