సార్వత్రిక ఎన్నికల్లో తుది సమరానికి సర్వం సిద్ధం.. నేటితో ముగియనున్న ఏడో విడత ఎన్నికల ప్రచారం
7th Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో తుది విడుత సమరానికి సర్వం సిద్ధం అయ్యింది.
7th Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో తుది విడుత సమరానికి సర్వం సిద్ధం అయ్యింది. జూన్ 1వ తేదీన జరగనున్న ఏడో దశ ఎన్నికలకు నేటితో ప్రచారం ముగియనుంది. ఆఖరి దశలో 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగుంది. ఏడోదశలో మొత్తం 904 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బిహార్‌లోని 8 లోక్‌సభ స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్‌లోని 4 స్థానాలకు, ఝార్ఖండ్ 3, ఒడిశా 6, పంజాబ్ 13, యూపీ 13, బెంగాల్ 9 స్థానాలతో పాటు చండీగఢ్‌కు తుదిదశలోనే పోలింగ్ జరగనుంది.
కాగా.. ఇప్పటికే ఆరుదశల్లో ముగిసిన ఎన్నికలల్లో 486 స్థానాలకు పోలింగ్ పూర్తైంది. ఇక పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు హిమాచల్ ప్రదేశ్‌లోని 4 లోక్ సభ స్థానాలకు ఏడోదశలో ఒకే సారి పోలింగ్ పూర్తి కానుంది. జూన్1వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడే అవకాశ ఉన్నట్టు తెలుస్తుంది. కాగా.. ఏడో దశలో ప్రధాని మోడీ వారణాసి నుంచి పోటీలో నిలిచారు.