Corona Cases in India: కొత్తగా 41,649 మందికి పాజిటివ్‌గా నిర్దారణ
Corona Cases in India: కోవిడ్‌తో మరో 493 మంది మృతి * 4.23 లక్షలకు చేరిన మృతుల సంఖ్య
Corona Cases in India: దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త కేసులు, మరణాల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24గంటల్లో 17 లక్షల 76 వేల 315 మందికి కోవిడ్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా వారిలో 41 వేల 649 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. క్రితం రోజుతో పోల్చితే ఆరు శాతం మేర కేసులు తగ్గినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24గంటల్లో కోవిడ్‌తో మరో 593 మంది చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 4 లక్షల 23 వేలకు చేరింది.
ఇటీవల నాలుగు లక్షల దిగువకు చేరిన రోజువారీ యాక్టివ్ కేసులు.. ఇప్పుడు మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నట్టు కేంద్రం పేర్కొంది. క్రియాశీల రేటు 1.28 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 97.37 శాతానికి చేరింది. కోవిడ్ నుంచి కోలుకుని మరో 37వేల మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.07 కోట్లకు చేరాయి. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 46కోట్ల మార్కును దాటింది. కేరళ, మహారాష్ట్రల్లోనే ఎక్కువగా కేసులు నమోదు కావడంతో.. వీకెండ్ లాక్‌డౌన్ విధించారు. మరోపక్కన కర్ణాటకలో వైరస్ భయాలు పెరిగాయి. దాంతో అక్కడి ప్రభుత్వం ఆంక్షలు కఠినతరం చేసింది. కర్ణాటకకు వచ్చేవారికి నెగెటివ్ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది.