Corona Cases in India: కొత్తగా 37,566 కేసులు.. 907 మరణాలు

Corona Cases in India: 100 రోజుల తర్వాత 40వేలలోపు కరోనా కేసులు

Update: 2021-06-29 05:07 GMT
Representational image

Corona Cases in India: సెకండ్ వేవ్ గండం నుంచి భారత్ బయటపడింది. కొత్త కేసులతో పాటు మరణాలు కూడా తగ్గుతున్నాయి. యాక్టివ్ కేసుల తగ్గడం.. రికవరీలు పెరగడం.. ఊరట కలిగిస్తోంది. కరోనా కోరల్లో చిక్కుకున్న భారత్ క్రమంగా బయటపడుతుండటంతో రాష్ట్రాలు లాక్‌డౌన్లను ఎత్తేస్తున్నాయి. వ్యాపారాలు మళ్లీ మొదలవుతుండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

అడ్డుఅదుపు లేకుండా ప్రపంచంపై విరుచుకుపడుతోన్న కరోనా వైరస్​భారత్‌లో నెమ్మదించింది. రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 102 రోజుల తర్వాత 40వేల కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 37,566 మంది వైరస్ బారిన పడ్డారు. కాగా, మహమ్మారి ధాటికి మరో 907 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి 56వేల 994 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 96.87 శాతంగా నమోదైంది. 102 రోజుల తర్వాత 40వేల కన్నా తక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 40కోట్ల 69లక్షలకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. సోమవారం ఒక్కరోజే 17లక్షల 68వేల మందికి కొవిడ్​-19 పరీక్షలు చేసినట్లు వెల్లడించింది. ఇప్పటివరకు 32కోట్ల 90లక్షల 29వేల 510 వ్యాక్సిన్​డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. సోమవారం ఒక్కరోజే.. 52లక్షల 76వేల 457 మందికి వ్యాక్సిన్ అందినట్లు వెల్లడించింది. 

Tags:    

Similar News