Dhamki: అందుకే వాయిదా పడిన విశ్వక్ సేన్ "ధమ్ కీ"
Dhamki: "ధమ్ కీ" సినిమాలో మార్పులు చేస్తున్న విశ్వక్ సేన్
Dhamki: ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యువ హీరో విశ్వక్ సేన్ తన తదుపరి సినిమా "ధమ్ కీ" షూటింగ్ పూర్తయిందని త్వరలోనే సినిమాకి సంబంధించిన విడుదల తేదీని ప్రకటిస్తామని అన్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి 16న థియేటర్లలో విడుదల కావాల్సింది. కానీ విశ్వక్ సేన్ ఈ సినిమా విడుదలని వాయిదా వేశారు. అయితే దానికి కారణం రవితేజ హీరోగా నటించి సూపర్ హిట్ అయిన "ధమాకా" సినిమా అని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే, "ధమాకా" మరియు "ధమ్ కీ" సినిమాల కథ ఒకేలా ఉంటుందట.
కొన్ని చిన్న చిన్న మార్పులు మరియు సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ తప్ప మిగతా సినిమా సిమిలర్ గా ఉంటుందని అందుకే రెండు సినిమాల ట్రైలర్లు కూడా ఒకేలా అనిపించాయని తెలుస్తోంది. పైగా ఈ రెండు సినిమాలకి రైటర్ గా పనిచేసింది ఒకళ్ళే కాబట్టి ఇలా జరిగి ఉంటుందని కొందరు అంటున్నారు. అయితే "ధమాకా" బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. అందుకే తన "ధమ్ కీ" సినిమాని వాయిదా వేసి సినిమాకి సంబంధించిన కొన్ని మార్పులు చేసి విడుదల చేస్తే బాగుంటుందని విశ్వక్ సేన్ నిర్ణయించుకున్నారట.
ఇక 20 రోజులపాటు సినిమాకి సంబంధించిన రీ షూట్ లు జరగబోతున్నాయట. అయితే ఇప్పుడు రవితేజ "ధమాకా" తో ఏ మాత్రం సంబంధం లేకుండా ఒక మంచి నేరేటివ్ ఉన్న సినిమా లాగా మార్చడానికి విశ్వక్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. చిత్ర బృందం దీన్ని అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ విడుదల కావలసిన సినిమా మళ్లీ రీషూట్ కి వెళ్లడంతోనే పరిస్థితి అర్థమవుతుంది.