Aishwarya Rajesh: 'సంక్రాంతికి వస్తున్నాం'ను రిజక్ట్‌ చేసిన ముగ్గురు హీరోయిన్లు.. ఐశ్వర్య ఆసక్తికర వ్యాఖ్యలు..!

Sankranthiki Vasthunam: విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం.

Update: 2025-01-16 09:43 GMT

Sankranthiki Vasthunam: విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుందీ మూవీ. దీంతో ఈ సంక్రాంతి బరిలో నిలిచిన బిగ్గెస్ట్‌ హిట్‌ మూవీస్‌ జాబితాలో చోటు దక్కించుకుందీ సినిమా. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ. 77 కోట్ల గ్రాస్‌ను రాబట్టి విమర్శకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ వారాంతం వరకు సెలవులు ఉండడంతో ఈ కలెక్షన్లు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వీకెండ్‌ నాటికి సంక్రాంతికి వస్తున్నాం మూవీ రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మొదట ఐశ్వర్య పాత్ర కోసం వేరే హీరోయిన్లను అనుకున్నారంటా. ఈ విషయాన్ని ఐశ్వర్య స్వయంగా తెలిపింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా చెప్పుకొచ్చింది.

వెంకటేష్‌ భార్యగా నటించిన ఈ పాత్ర తన దగ్గరికి వచ్చే ముందు ముగ్గురు హీరోయిన్స్ రిజెక్ట్ చేశారని చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి ముందే తనతో చెప్పారని, నలుగురి పిల్లల తల్లి పాత్ర కావడంతోనే వాళ్లు రిజెక్ట్ చేసినట్లు ఐశ్వర్య చెప్పుకొచ్చారు. అయితే అది తనకు పెద్ద సమస్యగా అనిపిచలేదని, ఎందుకంటే భాగ్యం లాంటి మంచి పాత్ర దొరకడం అదృష్టమని తెలిపింది. ఈ సినిమా చూస్తే అయ్యో ఇంత మంచి పాత్ర వద్దనుకున్నామా అని వాళ్లు బాధపడడం ఖాయమని ఐశ్వర్య తెలిపింది.

ఇదిలా ఉంటే డిసెంబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ మొదటి ఆట నుంచే పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తొలి రోజే ఈ సినిమా ఏకంగా రూ. 45 కోట్ల గ్రాస్‌ రాబట్టి సంక్రాంతి హిట్‌గా నిలిచింది. మరి ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడానికి మరెంత సమయం పడుతుంతో చూడాలి.

Tags:    

Similar News