Game Changer: గేమ్‌ ఛేంజర్ మూవీని దెబ్బతీసేలా శంకర్ సంచలన వ్యాఖ్యలు

Game Changer: సంక్రాంతికి బరిలో నిలిచిన సినిమాల్లో గేమ్ ఛేంజర్ ఒకటి. భారీ అంచనాల మధ్య జనవరి 10న ఈ సినిమా విడుదలైంది.

Update: 2025-01-15 10:37 GMT

Game Changer: గేమ్‌ ఛేంజర్ మూవీని దెబ్బతీసేలా శంకర్ సంచలన వ్యాఖ్యలు

Game Changer: సంక్రాంతికి బరిలో నిలిచిన సినిమాల్లో గేమ్ ఛేంజర్ ఒకటి. భారీ అంచనాల మధ్య జనవరి 10న ఈ సినిమా విడుదలైంది. రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే గేమ్ ఛేంజర్ చిత్రానికి ఆరంభం నుంచే మిక్డ్స్ టాక్ వస్తోంది. శంకర్ ఈ మూవీని తెరకెక్కించిన విధానంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఈ తరుణంలో గేమ్ ఛేంజర్ అవుట్‌పుట్‌తో తాను సంతృప్తిగా లేనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేసి అందరికీ షాకిచ్చారు శంకర్. ప్రస్తుతం దర్శకుడు శంకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గేమ్ ఛేంజర్ సినిమా అవుట్‌పుట్‌తో తాను సంతృప్తిగా లేనని.. ఇంతకంటే బాగా చేసుండాల్సిందని అన్నారు. తాను అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా నిడివి 5 గంటల వరకు ఉండాలి. సమయాభావం వల్ల కొన్ని సీన్స్ ట్రిమ్ చేయాల్సి వచ్చింది. దీంతో కథ తాను అనుకున్న విధంగా రాలేదంటూ చెప్పుకొచ్చారు శంకర్. గేమ్ ఛేంజర్ సినిమా గురించి ఏవైనా యూట్యూబ్, ఆన్‌లైన్ రివ్యూలు చూశారా అని డైరెక్టర్ శంకర్‌కు ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందించిన శంకర్.. తాను ఏ రివ్యూలు చూడలేదని.. అయితే మంచి రివ్యూలే వస్తున్నాయని తాను విన్నానని అన్నారు.

అయితే గేమ్ ఛేంజర్ చూసిన చాలా మంది ప్రేక్షకులు ఎన్నో అనవసరమైన సీన్స్ ఉన్నాయని, వాటిని తీసేసి ఆయన ముఖ్యం అనుకున్న సీన్స్‌ను యాడ్ చేసి ఉండొచ్చు కదా అని సలహా ఇస్తున్నారు. అసలు రామ్ చరణ్ తన కెరీర్‌లో పీక్ టైమ్‌ని శంకర్‌కి ఇస్తే సరిగా వినియోగించుకోలేకపోయారంటూ విమర్శిస్తున్నారు. అయినా అవుట్‌పుట్‌తో సంతృప్తిగా లేనన్న విషయం శంకర్ ఇప్పుడు చెప్పడం వల్ల ఉపయోగమేంటని ప్రశ్నిస్తున్నారు. మూవీ ఓ ఫ్లోలో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత డైరెక్టర్‌దేనని.. ముఖ్యమైన సీన్లు తీసేశామని ఎలా చెబుతారని పోస్టులు చేస్తున్నారు. రివ్యూలు పట్టించుకోకుండా ఉండడం సరికాదని.. చేసిన పొరపాట్లను తెలుసుకోవాలి కదా అని మరికొందరు ట్రోల్స్ చేస్తున్నాన్నారు. మరికొందరు ఇలాంటి సమయంలో శంకర్ ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల మూవీకి మరింత నెగిటివిటీ పెరుగుతుందని ఫీలవుతున్నారు. మొత్తానికి శంకర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

శంకర్ రోబో తర్వాత నుంచి ఆ రేంజ్ సక్సెస్ సాధించలేకపోతున్నారు. ముఖ్యంగా గతేడాది ఇండియన్2 చిత్రంతో తీవ్రంగా నిరాశపరిచారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ విషయంలోనూ అసంతృప్తికి గురిచేశారు. ఏకంగా నాలుగు సంవత్సరాలు పాటు ఈ మూవీ షూటింగ్ చేసి పెద్దగా మెప్పించలేకపోయారు. కొన్ని సీన్లు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు మినహా గేమ్ ఛేంజర్ మూవీ పెద్దగా ఆసక్తికరంగా లేదనే మిక్డ్స్ టాక్ వచ్చింది. ఒకప్పుడు సోషల్ మెసేజ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న శంకర్.. ఇప్పుడు గేమ్ ఛేంజర్‌ మూవీతో కాస్త ఫామ్‌లోకి వచ్చాడు అనుకునేలోపే అసలు తాను తెరకెక్కించిన మూవీ అవుట్‌పుట్ సంతృప్తిగా లేదంటూ కామెంట్స్ చేసి అందరికీ షాకిచ్చారు.

గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటించారు. చరణ్, కియారా మధ్య ఒక లవ్ ఎపిసోడ్‌ను యాడ్ చేసినా అది యూత్‌ను ఇంప్రెస్ చేయలేకపోయిందంటున్నారు ఆడియన్స్. ముఖ్యంగా ఈ మూవీలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ మాత్రమే అందరినీ ఆకట్టుకుందని.. అందులో తండ్రి పాత్రలో నటించిన రామ్ చరణ్.. తన యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నారని అంటున్నారు. పలు సీన్స్‌లో ఎమోషనల్ అయ్యేలా చేశారని.. ఇక తనకు జోడీగా నటించిన అంజలి సైతం తన నటనతో ఆకట్టుకుందని చెబుతున్నారు. దాదాపు రూ.450 కోట్లతో తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ చిత్రం తొలిరోజు రూ.186 కోట్లు రాబట్టింది.

Tags:    

Similar News