Hari Hara Veeramallu song promo: సంక్రాంతి కానుగా హరిహర వీరమల్లు సినిమా నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ మాట వినాలి అంటూ సాగే పాట ప్రోమోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను స్వయంగా పవన్ ఆలపించారు. తాజాగా విడుదలైన ప్రోమోలో వీరమల్లు మాట వినాలి.. అంటూ పవన్ గొంతు అందరిలో జోష్ నింపుతోంది.
ఈ పాటను ఈనెల 6న విడుదల చేస్తామని గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ వాయిదా పడింది. మళ్లీ ఇప్పుడు సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసి.. పూర్తి పాటను ఈ నెల 17న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. గతంలో నాలుగైదు చిత్రాల్లో పాటలు పాడిన పవన్... కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సినిమాలో పాడుతుండడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Beginning the Musical Storm 🎵🌪#HariHaraVeeraMallu 1st Single Promo Out Now 💥#MaataVinaali (Telugu) - https://t.co/ebgZz9mHPY
— Hari Hara Veera Mallu (@HHVMFilm) January 14, 2025
Sung by the one and only, POWERSTAR 🌟 @PawanKalyan garu 🎶🎤
A @mmkeeravaani Musical 🎹
Lyrics by 📝 #PenchalDas
Full song out on 17th Jan at… pic.twitter.com/uTVru2szqg
ఈ మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. పవన్ హరిహర వీరమల్లు కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈమూవీ మార్చి 28న రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది.