Daaku Maharaaj collections: బాలయ్య బాబు కెరీర్లో రికార్డ్... డాకు మహారాజ్ ఫస్ట్‌డే కలెక్షన్లు ఎంతంటే?

Daaku Maharaaj collections: బాలయ్య బాబు కెరీర్లో రికార్డ్... డాకు మహారాజ్ ఫస్ట్‌డే కలెక్షన్లు ఎంతంటే?

Update: 2025-01-13 09:49 GMT

Daaku Maharaaj collections: డాకు మహారాజ్ ఫస్ట్‌డే కలెక్షన్లు ఎంతంటే?

Daaku Maharaaj movie day 1 collections: నందమూరి బాలకృష్ణకు మరోసారి సంక్రాంతి సెంటిమెంట్ ‌కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఇప్పటివరకు సంక్రాంతికి వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు బాలయ్య. ఇప్పుడు డాకు మహారాజ్ మూవీతో మరోసారి సత్తా చాటారు. భారీ అంచనాల మధ్య జనవరి 12న సంక్రాంతి బరిలోకి దిగారు బాలకృష్ణ. ఈ సినిమా పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. తాజాగా ఫస్ట్ డే కలెక్షన్లలోనూ అదరగొట్టారు బాలయ్య. ఇంతకు ఫస్ట్ రోజు మూవీ కలెక్షన్ఎంతో చూద్దాం.

గత మూడేళ్లుగా బాలకృష్ణ నటిస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకుంటోంది. అఖండ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బాలకృష్ణ. ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇటీవల వచ్చిన డాకు మహారాజ్ అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. గతంలో వచ్చిన అఖండ సినిమా మొదలుకొని.. సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ సినిమా వరకు ప్రతి సినిమా కూడా మాస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉండగా జనవరి 12వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటిరోజు ఎంత కలెక్షన్ వసూలు చేసింది అనే విషయం వైరల్‌గా మారుతోంది. తాజా సమాచారం ప్రకారం డాకు మహారాజ్ ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ వసూలు చేసిందనే విషయాన్ని ఒక పోస్టర్ ద్వారా రివీల్ చేశారు మేకర్స్. అందులో భాగంగానే రూ.56 కోట్లకు పైగా కలెక్షన్ వసూలు చేసినట్టు మేకర్స్ పోస్టర్‌తో సహా రిలీజ్ చేశారు. దీంతో బాలకృష్ణ కెరీర్‌లో అత్యంత అధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్టులో డాకు మహారాజ్ చేరింది.

తనకు బాగా కలిసొచ్చే సంక్రాంతి పండగకు డాకు మహారాజ్‌తో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు బాలకృష్ణ. శ్రీకర్ స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూర్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడు. ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించగా.. విలన్ పాత్రలో యానిమల్ మూవీ ఫేమ్ బాబీ డియోల్ కనిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి టీజర్, ట్రైలర్‌తోనే ఈ చిత్రంపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. అందుకు తగినట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం జరిగింది.

ఇక బాలకృష్ణ సినిమా అంటే మాస్ ఎలివేషన్స్ పాటు డైలాగులకు ప్రాధాన్యం ఉంటుంది. తాజాగా విడుదలైన డాకు మహారాజ్‌లోనూ బాలయ్య డైలాగులు అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. భాను భోగవరపు, నందు మాటలు ఆకట్టుకుంటున్నాయి. సింహం నక్కల మీదకొస్తే వార్ అవ్వదు.. వార్నింగ్ చంపేవాడు ఇవ్వాలి. చచ్చేవాడు కాదు. వంటి డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో సంక్రాంతి విన్నర్ బాలయ్య అంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Tags:    

Similar News