Allu Arjun: నా హృదయంలో ఇది ఎప్పటికీ ప్రత్యేక స్థానం.. వైరల్ అవుతోన్న అల్లు అర్జున్‌ పోస్ట్‌..!

Allu Arjun: అల్లు అర్జున్‌.. ఇప్పుడీ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పాన్‌ ఇండియా స్థాయిలో పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నారు బన్నీ.

Update: 2025-01-13 05:20 GMT

Allu Arjun: నా హృదయంలో ఇది ఎప్పటికీ ప్రత్యేక స్థానం.. వైరల్ అవుతోన్న అల్లు అర్జున్‌ పోస్ట్‌..!

Allu Arjun: అల్లు అర్జున్‌.. ఇప్పుడీ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పాన్‌ ఇండియా స్థాయిలో పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నారు బన్నీ. పుష్ప2 చిత్రం విజయంతో ఎనలేని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. బాలీవుడ్ అగ్ర హీరోలు సైతం చేరుకోలేని మైలురాయిని సైతం బన్నీ అవలీలగా దాటేశాడు. ఏకంగా రూ. 1800 కోట్ల కలెక్షన్లతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇదిలా ఉంటే బన్నీ కెరీర్‌లో మరిచిపోలేని చిత్రాల్లో అల వైకుంఠపురములో ఒకటి. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 2020 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. త్రివిక్రమ్‌, బన్నీ కాంబినేషన్‌లో హిట్‌గా నిలిచిన మూడో చిత్రంగా నిలిచిందీ మూవీ.

కాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సరిగ్గా ఐదేళ్లు గడిచింది. ఈ సందర్భంగా ఎక్స్‌ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అల వైకుంఠపురంలో మూవీ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని బన్నీ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా తన హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుందని బన్నీ రాసుకొచ్చారు. ఇలా ఘన విజయాన్ని అందించిన త్రివిక్రమ్, చినబాబు, అల్లు అరవింద్, తమన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఇక ఈ అద్భుతమైన చిత్రానికి జీవం పోసిన నటీనటులు, సిబ్బందితో పాటు మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ మూవీ సమయంలో దిగిన ఫోటోలను బన్నీ షేర్‌ చేసుకున్నారు. అల్లు అర్జున్‌ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉంటే పుష్ప2 తర్వాత బన్నీ మరోసారి త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 



Tags:    

Similar News