Rashmika Mandanna: 'ఎప్పుడు కోలుకుంటానో భగవంతుడికే తెలియాలి'.. రష్మిక పోస్ట్‌ వైరల్‌

Update: 2025-01-12 07:05 GMT

Rashmika Mandanna: జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గాయపడిన రష్మిక మందన్న

Rashmika Mandanna injured during workouts: పుష్ప2 మూవీతో గతేడాది భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది అందాల తార రష్మిక మందన. అంతకు ముందు యానిమల్‌ మూవీతో కూడా దేశవ్యాప్తంగా క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇలా వరుసగా భారీ చిత్రాల్లో నటించి జోష్‌ మీదున్న రష్మిక ఈ ఏడాది ఏకంగా 5 సినిమాలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. రష్మిక నటిస్తోన్న 5 సినిమాలు ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇదిలా ఉంటే రష్మిక ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తుందని తెలిసిందే.

టైమ్‌ దొరికినప్పుడుల్లా జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తుంది. అయితే తాజాగా అదే జిమ్‌లో రష్మిక గాయపడింది. జిమ్‌లో వర్కవుట్‌ చేస్తూ గాయపడింది. తాజాగా ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుందీ బ్యూటీ. కాలికి కట్టు కట్టుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. తమ అభిమాన తారకు ఏమైందని ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు.

కాలికి కట్టుతో ఉన్న ఫొటోను షేర్‌ చేసిన రష్మిక.. 'తనకు కొత్త సంవత్సరం శుభారంభాన్ని ఇచ్చిందని వ్యంగ్యంగా తనకు తనే నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుందామె. తను ఎంతో పవిత్రంగా భావించే జిమ్‌లో గాయపడ్డాను. పూర్తిగా ఎప్పుడు కోలుకుంటానో ఆ భగవంతుడికే తెలియాలి. త్వరగా కోలుకుని ‘సికందర్‌’, ‘థామ’, ‘కుబేర’ సెట్స్‌లో పాల్గొనాలని ఆశిస్తున్నా. ఈ ఆలస్యానికి క్షమించాలని ఆయా చిత్రాల దర్శకులను కోరుతున్నా. నా కాలు ఏమాత్రం సెట్‌ అయినా వెంటనే షూట్‌లో భాగం అవుతా' అని రాసుకొచ్చింది.

ఇక కెరీర్‌ విషయానికొస్తే రష్మిక ప్రస్తుతం ‘సికందర్‌’లో నటిస్తోంది. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. గాయం కారణంగా షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చిన రష్మిక త్వరలోనే తిరిగి షూటింగ్‌లో పాల్గొననుంది. మరో బాలీవుడ్‌ చిత్రం ‘థామా’లోనూ ఆమె నటిస్తున్నారు. రష్మిక నటించిన ఛావా చిత్రం ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందు సిద్ధమవుతోంది.

Tags:    

Similar News