Actors weddings: విజయ్ దేవరకొండ, రష్మిక ఈ ఏడాది పెళ్లి చేసుకుంటున్నారా?

రష్మిక కూడా ఈ ఏడాది పెళ్లి పీటలెక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా నిర్మాత నాగవంశీ.. రష్మిక ఓ తెలుగు హీరోతో ప్రేమలో ఉందని తెలిపిన విషయం తెలిసిందే.

Update: 2025-01-12 09:30 GMT

Actors weddings: విజయ్ దేవరకొండ, రష్మిక ఈ ఏడాది పెళ్లి చేసుకుంటున్నారా? 

Actors weddings: పెళ్లి ప్రతీ ఒక్కరి జీవితంలో ఎంత ముఖ్యమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న పెళ్లిని ఘనంగా జరుపుకోవాలని అందరూ భావిస్తుంటారు. ఇందుకు హీరోయిన్లు కూడా అతీతులేం కాదు. వివాహం చేసుకొని ఓ ఇంటి వారు కావాలని అంతా ఆశపడుతుంటారు. ఇలా గతేడాదిలో కొందరు బ్యూటీలు పెళ్లి చేసుకొని సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు.

2024లో ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోయిన్లు శ్రీమతులుగా మారారు. వీరిలో రకుల్‌, కీర్తి సురేష్‌ వంటి వారు ఉన్నారు. రీసెంట్‌గా కీర్తి సురేష్‌ తన ప్రియుడితో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కొత్త ఏడాదిలో కూడా ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది కొందరు నటీమణులు పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఈ జాబితాలో ఉన్న కొందరు బ్యూటీలు ఎవరంటే.

* ఈ ఏడాది అందరి కంటే ముందు పెళ్లి చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్న వారిలో నటి తమన్న ముందు వరుసలో ఉందని చెప్పాలి. ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్‌ వర్మతో డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతోందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది వీరి పెళ్లికావడం ఖాయని తెలుస్తోంది. ఇక వీరిద్దరు కలిసి లస్ట్ స్టోరీస్‌2లో నటించిన విషయం తెలిసిందే.

* ఇక నేషనల్ క్రష్‌ రష్మిక కూడా ఈ ఏడాది పెళ్లి పీటలెక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా నిర్మాత నాగవంశీ.. రష్మిక ఓ తెలుగు హీరోతో ప్రేమలో ఉందని తెలిపిన విషయం తెలిసిందే. అయితే విజయ్‌ దేవరకొండ, రష్మిక గత కొన్ని రోజులుగా రిలేషన్‌లో ఉన్నారన్న వార్త బహిరంగమే రహస్యమే. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు ఈ ఏడాది పెళ్లి పీటలెక్కనున్నారనని ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తోంది.

* అలాగే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ సైతం ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోబోతోందని టాక్‌ నడుస్తోంది. జాన్వీ ప్రస్తుతం శిఖర్ పహారియాతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ బ్యూటీ ప్రియుడితో కలిసి తిరుమలకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరూ కలిసి పూజలు సైతం నిర్వహించారు. ఈ జంట ఈ ఏడాది పెళ్లి పీటలెక్కబోతందని టాక్‌. అయితే జాన్వీ ఇంత చిన్న వయసులో పెళ్లి చేసుకుంటుందా లేదా అన్నది చూడాలి.

Tags:    

Similar News