Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి ఆ అమ్మాయితోనే.. హింట్ ఇచ్చిన రామ్ చరణ్..

Prabhas Marriage: ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ప్రభాస్.

Update: 2025-01-11 07:48 GMT

Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి ఆ అమ్మాయితోనే.. హింట్ ఇచ్చిన రామ్ చరణ్..

Prabhas Marriage: ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ప్రభాస్. ప్రభాస్ పెళ్లి వార్త కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు. ఎవరిని పరిణయమాడతారు అంటూ చర్చ జరుగుతూనే ఉంది. గతంలో ప్రభాస్ వివాహంపై చాలా వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా ప్రభాస్ పెళ్లిపై ఆయన స్నేహితుడు, హీరో రామ్ చరణ్ హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రభాస్ పెళ్లి గురించి ఆయనకు కాబోయే భార్య ఈ అమ్మాయే అంటూ సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ క్రియేట్ అయ్యాయి. కొన్నిసార్లు ఆ హీరోయిన్ తో ప్రభాస్ ప్రేమ, పెళ్లి అంటూ ప్రచారం నడిచింది. ఆ తర్వాత బంధువుల అమ్మాయినే వివాహం చేసుకుంటాడని రూమర్ వినిపించింది. అయితే ఇప్పటివరకు ఈ విషయాలపై ప్రభాస్ ఎప్పుడూ స్పందించలేదు.

అయితే గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌లో భాగంగా రామ్ చరణ్.. అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోకు హాజరయ్యారు. ప్రభాస్ ఎవరిని పెళ్లాడనున్నారనే విషయాన్ని ఈ షోలో హింట్ ఇచ్చారు చరణ్. ఈ షోలో ప్రభాస్ పెళ్లి గురించి బాలకృష్ణ ప్రశ్నించగా.. రామ్ చరణ్ నవ్వులు పూయించారు. ఏపీలోని గణపవరానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోనున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది. దీంతో ప్రభాస్ పెళ్లి గురించి రామ్ చరణ్ హింట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆ అమ్మాయి ఎవరా అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఈ షోలో బాలయ్య.. రామ్ చరణ్‌తో ప్రభాస్‌కు ఫోన్ చేయించారు. అలాగే తన ఇద్దరు స్నేహితులు హీరో శర్వానంద్, విక్కీతో కలిసి చరణ్ పాల్గొన్నారు. ఇందులో తన కూతురు క్లింకారతో పాటు పలు ఆసక్తికర విషయాల గురించి రాంచరణ్ పంచుకున్నట్టు తెలుస్తోంది.ఈ ఎపిసోడ్ తొలి భాగం జనవరి 8న విడులైంది. ఇక రెండో భాగం జనవరి 14న ప్రసారం కానుంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. దీంతో ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ముందుగా రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కామెడీ, హర్రర్ జానర్‌లో డైరక్టర్ మారుతి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఫౌజీ, సలార్2, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్, నాగ్ అశ్విన్‌తో కల్కి2 సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది.

Tags:    

Similar News