Daaku Maharaaj: బాలయ్య కెరీర్‌లోనే హైయ్యెస్ట్.. డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే...?

Daaku Maharaaj: నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Update: 2025-01-11 06:50 GMT

Daaku Maharaaj: బాలయ్య కెరీర్‌లోనే హైయ్యెస్ట్.. డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే...?

Daaku Maharaaj: నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మొదటి ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచింది. తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్‌ మరింత హైప్ క్రియేట్ చేసింది. జనవరి 12న ఈ సినిమా విడుదలవుతుంది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉందో చూద్దాం.

ఈ సినిమా వరల్డ్ వైడ్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. తెలంగాణలో రూ.17.50 కోట్లు, రాయలసీమ రూ.15.50 కోట్లు, ఉమ్మడి ఉత్తరాంధ్ర రూ.8 కోట్లు, ఉమ్మడి తూర్పుగోదావరి రూ.6 కోట్లు, ఉమ్మడి పశ్చిమగోదావరి రూ.5 కోట్లు, ఉమ్మడి కృష్ణా రూ.5.4 కోట్లు, ఉమ్మడి గుంటూరు రూ.7.2 కోట్లు, ఉమ్మడి నెల్లూరు రూ.2.7 కోట్లు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి రూ.67.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ఓవర్సీస్ రూ.8 కోట్లు, కర్ణాటక+రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ.5.40 కోట్లు మొత్తంగా రూ.80.70 కోట్లు బిజినెస్ చేసింది. ఇది ఇప్పటి వరకు బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ అని చెబుతున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.82 కోట్ల షేర్ రాబట్టాలి.

ఇదిలా ఉంటే.. మొదటి ట్రైలర్‌లో బాలయ్య మాస్ ఎలిమెంట్స్ తగ్గాయని కామెంట్స్ వినిపించాయి. అందుకే ఫ్యాన్స్ కోసం టీమ్ తాజాగా రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్‌లో కొన్ని పవర్ ఫుల్ షాట్స్ బాలయ్య క్యారెక్టర్ ఎంత వయలెంట్‌గా ఉంటుందో క్లారిటీ ఇచ్చారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బాబీ డియోల్ విలనిజం, డాకు పాత్రను వర్ణించిన తీరు ఈ ట్రైలర్ లో స్పెషల్ గా ఉన్నాయి.

తమన్ మ్యూజిక్ అందించిన ఈ మూవీని సితార ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ సుమారు రూ.100 కోట్లతో నిర్మించారు. బాలకృష్ణ సరసన శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌతేలా హీరోయిన్లుగా నటించారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి లాంటి మూడు బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై మంచి హైప్ ఉంది. మరోసారి సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని బాలయ్య ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. వాల్తేరు వీరయ్య హిట్ తర్వాత బాబీ నుంచి వస్తున్న సినిమా కూడా అవడం వల్ల డాకు మహారాజ్ పై అందరూ ఎంతో నమ్మకంగా ఉన్నారు.

మరి డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ అందుకుంటుందా లేదా తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News