Pragya Jaiswal: బాలకృష్ణ నా లక్కీఛార్మ్.. ప్రగ్యా ఆసక్తికర వ్యాఖ్యలు..!
Pragya Jaiswal: కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార ప్రగ్యా జైస్వాల్.
Pragya Jaiswal: కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార ప్రగ్యా జైస్వాల్. తొలి సినిమాతోనే తనదైన నటన, అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ మూవీ. తొలి సినిమా కమర్షియల్‌గా విజయాన్ని అందించకపోయినా నటిగా మాత్రం మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. ఆ తర్వాత వరుసగా పలు చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకున్నా ఆశించిన స్థాయిలో మాత్రం విజయాలను అందుకోలేకపోయిందీ బ్యూటీ.
ఇక కొన్ని రోజుల గ్యాప్ తర్వాత బాలకృష్ణ హీరోగా 2021లో వచ్చిన అఖండ మూవీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ప్రగ్యా. ఈ సినిమా ప్రగ్యా కెరీర్‌కు బూస్ట్‌నిచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం బాలకృష్ణతో వరుసగా రెండు చిత్రాల్లో నటిస్తోంది. వీటిలో ఒకటి డాకు మహారాజ్ కాగా మరో చిత్రం అఖండ్2. ప్రస్తుతం డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.
సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన ఈ సినిమా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రగ్యా జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. వరుసగా బాలకృష్ణతో సినిమాలు చేయడానికి కారణం ఏంటన్న ప్రశ్నకు బదులిస్తూ పాత రోజులను గుర్తు చేసుకుందీ బ్యూటీ. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. బాలకృష్ణ తన లక్కీఛార్ అని చెప్పుకొచ్చింది. ఆయనతో కలిసి వరుసగా సినిమాలు చేయడం అరుదైన ఓ గొప్ప అవకాశం అంటూ చెప్పుకొచ్చింది.
ఇక అఖం చిత్రం తన జీవితాన్ని రాత్రికి రాత్రే మార్చేసిందని చెప్పుకొచ్చి ప్రగ్యా.. కరోనా సమయంలో దర్శకుడు బోయపాటి శ్రీను ఫోన్ చేసి హైదరాబాద్‌కి రమ్మన్నారని, ఆయన ఏ సినిమా కోసం పిలిచారో కూడా ఆ సమయంలో తనకు తెలియదు అని తెలిపింది. అయితే పిలిచిన వెంటనే ముంబయి నుంచి ఓ హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని హైదరాబాద్‌లో దిగిపోయానని, వెళ్లి కలవగానే కథ చెప్పారని తెలిపింది.
గంటలోపే ఆ సినిమా ఖరారైంది. కెరీర్‌లో తనకు దక్కిన పెద్ద విజయం ఆ సినిమా అని చెప్పుకొచ్చింది. ఇక అఖండకు కొనసాగింపుగా వస్తున్న ‘అఖండ2’లో నటిస్తున్నానని చెప్పుకొచ్చింది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. 'తెలుగులో నాకు పరిచయమైన తొలి దర్శకుడు బాబీ. ఆయనతో కలిసి సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా కానీ ఇప్పుడు కుదిరింది. హిందీలో ‘ఖేల్ ఖేల్ మే’ సినిమా చేశా. ఏడుగురు పెద్ద నటులతో కలిసి చేసిన ఆ సినిమా చాలా సమయం తీసుకుంది. అంతే తప్ప, మరే కారణం లేదు. ఎక్కువ భాషల్లో నటించాలని, ఎక్కువ సినిమాలు చేయాలనే తపనతోనే ఉన్నా'ని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.