Game Changer theatrical rights: గేమ్ ఛేంజర్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్

Game Changer movie pre release business: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. మూవీ వరల్డ్ వైడ్‌గా రూ.221 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.221 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. గ్రాస్ పరంగా చూస్తే రూ.450 కోట్ల దాకా కలెక్ట్ చేయాల్సి ఉంది.

Update: 2025-01-09 13:41 GMT

Game Changer movie pre release business: మెగాస్టార్ రాంచరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదరుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో అడుగు పెట్టనుంది. రాంచరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. ఇక గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. మూవీ వరల్డ్ వైడ్‌గా రూ.221 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

గేమ్ ఛేంజర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కలిపి రూ.122 కోట్ల బిజినెస్ చేసింది. ఏరియాల వారీగా చూస్తే.. నైజాంలో రూ.43.50 కోట్లు, రాయలసీమ (సీడెడ్‌)లో రూ.23 కోట్లు, ఆంధ్రాలో రూ.55.50 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటకలో రూ.14.50 కోట్లు, తమిళనాడులో రూ.15 కోట్లు, కేరళలో రూ.2 కోట్లు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో రూ.42.50 కోట్లు, ఓవర్సీస్ రూ.25 కోట్లు కలిపి ఓవరాల్‌గా రూ.221 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.221 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. గ్రాస్ పరంగా చూస్తే రూ.450 కోట్ల దాకా కలెక్ట్ చేయాల్సి ఉంది.

డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గేమ్ ఛేంజర్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలవుతుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి లీడ్ రోల్స్ పోషించారు. థమన్ సంగీతం, ఎస్.జె. సూర్య నటన ఈ చిత్రానికి ఫ్లస్ కానున్నాయి.

ఇక సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి మేకర్స్ ఇప్పటికే భారీ ప్రమోషన్స్ నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్లతో పాటు రామ్ చరణ్ అన్‌స్టాపబుల్ ఇంటర్వ్యూ సినిమాపై హైప్‌ను రెట్టింపు చేశాయి. గేమ్ ఛేంజర్ సాంగ్స్, టీజర్, ట్రైలర్‌లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఈ సినిమా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ఆయా రాష్ట్రాలు స్పెషల్ పర్మిషన్స్ ఇచ్చాయి.

సోలో హీరోగా రామ్ చరణ్ కెరీర్‌లో అత్యధిక బిజినెస్ రూ.90 కోట్లతో వినయ విధేయ రామ ఇప్పటి వరకు టాప్‌లో ఉంది. చరణ్ నటించిన మల్టీస్టారర్ సినిమాల విషయానికొస్తే.. ఆర్ఆర్ఆర్ రూ.450 కోట్లు, ఆచార్య రూ.130 కోట్లు బిజినెస్ చేశాయి.

ఇక గేమ్ ఛేంజర్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. శంకర్ మార్క్ భారీ యాక్షన్ సీన్లు, సెంటిమెంట్‌తో కూడిన కథనం ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్లస్ అవుతాయని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి సంక్రాంతి రేసులో గేమ్ ఛేంజర్ తనదైన ముద్ర వేయడం ఖాయమని అంటున్నారు. చరణ్, శంకర్ కాంబినేషన్‌ ప్రేక్షకులకు మరో బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించబోతోంది. మరి సంక్రాంతి భారీ పోటీలో గేమ్ ఛేంజర్ టార్గెట్‌ను అందుకుంటాడా? మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ అవుతాయో చూడాలి మరి.

Tags:    

Similar News