అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప2 చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్ల రికార్డు కలెక్షన్లను రాబట్టిందీ మూవీ. పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాసింది. డిసెంబర్ 5వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌తోనే రికార్డులను సృష్టించడం మొదలు పెట్టింది.
ముఖ్యంగా బాలీవుడ్‌లో సరికొత్త చరిత్రను సృష్టించిందీ మూవీ. ఇప్పటి వరకు సాధ్యం కానీ రెయిర్ రికార్డును పుష్ప2 బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా ఏకంగా రూ. 1800 కోట్ల వరకు రాబట్టింది. పుష్2 కలెక్షన్లు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సంక్రాంతి సీజన్ నేపథ్యంలో పుష్ప2 కలెక్షన్లను మరింత పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కలెక్షన్లను మరింత రాబట్టే దిశగా ఓ అడుగు వేసింది. పుష్ప2 సినిమాలో అదనంగా మరో 20 నిమిషాలను జోడిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 11వ తేదీ నుంచి ఈ కొత్త సన్నివేశాలను యాడ్ చేస్తున్నట్లు తెలిపారు. వీటిలో యాక్షన్ సీన్స్ ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు క్యూకడతారని చిత్ర యూనిట్ భావిస్తోంది.
వీకెండ్‌తో పాటు సంక్రాంతి సెలవులు కూడా కలిసి వస్తుండడంతో పుష్ప2 కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మేకర్స్ ఆలోచన వర్కవుట్ అయితే పుష్ప2 రూ. 2000 కోట్ల మార్క్‌ను చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మేకర్స్ ఆలోచన ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.