Salman Khan: బిష్ణోయ్ బెదిరింపులతో సల్మాన్ ఇంటికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్

గ్యాంగ్‌ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) తన భద్రతపై ఫుల్ ఫోకస్ పెట్టారు.

Update: 2025-01-07 12:06 GMT

Salman Khan: బిష్ణోయ్ బెదిరింపులతో సల్మాన్ ఇంటికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్

Bishnoi Threats Salman Khans Galaxy Apartment gets upgraded with bulletproof glass

గ్యాంగ్‌ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)  ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. (Big Security Upgrade). ఇప్పటికే బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్ తాజాగా తన ఇంటికి కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ముంబై బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ వద్ద సెక్యూరిటీని పెంచుకుంటున్నారు. సల్మాన్ ఇంటి బాల్కానీని బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌తో (Bulletproof glass) కప్పేస్తున్నారు. అంతేకాదు అపార్ట్‌మెంట్ చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే గుర్తించేందుకు హై రిజల్యూషన్ కలిగిన సీసీ టీవీ కెమెరాలతో పాటు (high-resolution CCTV camera) హైటెక్ సెక్యూరిటీ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇద్దరు కార్మికులు సల్మాన్ ఇంటి బాల్కనీకి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అమరుస్తున్న వీడియో తాజాగా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.



ఇటీవల సల్మాన్ ఖాన్ బుల్లెట్ ప్రూఫ్ కారు కొనుగోలు చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. రూ.2 కోట్లు విలువైన ఆ కారును దుబాయ్ నుంచి దిగుమతి చేసుకున్నారని టాక్. మరోవైపు బెదిరింపుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సల్మాన్‌కు వై కేటగిరీ భద్రత పెంచింది.

1998లో కృష్ణ జింకను వేటాడిన కేసు నేపథ్యంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఇప్పటికే అనేక సార్లు బెదిరింపులు ఎదుర్కొన్నారు. గత ఏడాది ఏప్రిల్ లో సల్మాన్ నివాసం ఉంటున్న గెలాక్సీ అపార్ట్‌మెంట్ దగ్గర కాల్పుల ఘటన చోటుచేసుకుంది. బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు సల్మాన్ ఖాన్(Salman Khan)ఇంటి ముందు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఇక ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే జూన్ లో మరోసారి సల్మాన్ హత్యకు కుట్ర జరిగింది. పన్వేల్ ఫామ్ హౌస్ నుంచి ఇంటికి వెళ్తున్న మార్గంలో సల్మాన్ పై దాడి చేయాలని గ్యాంగ్ ప్లాన్ చేసినట్టు గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు వరుస హత్య బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ పూర్తి భద్రతా వలయంలో ఉన్నారు.

ఇక సల్మాన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సికిందర్ మూవీలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నడియాద్వాలా గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తుండగా.. సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సమాజంలోని అవినీతి, నేరాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి కథ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని టాక్.

Tags:    

Similar News