Allu Arjun: శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్‌

Allu Arjun: బేగంపేట్‌లోని కిమ్స్‌ ఆస్పత్రికి చేరుకున్నారు హీరో అల్లు అర్జున్. కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పాందుతున్న శ్రీతేజ్‌ను ఆయన పరామర్శించారు.

Update: 2025-01-07 05:38 GMT

Allu Arjun: శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్‌

Allu Arjun: బేగంపేట్‌లోని కిమ్స్‌ ఆస్పత్రికి చేరుకున్నారు హీరో అల్లు అర్జున్. కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పాందుతున్న శ్రీతేజ్‌ను ఆయన పరామర్శించారు. శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు బన్నీ. అనంతరం శ్రీతేజ్‌ కుటుంబసభ్యులతో సైతం అల్లు అర్జున్‌ మాట్లాడారు. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. 35 రోజులుగా కిమ్స్‌ ఆస్పత్రిలో శ్రీతేజ్‌కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మరోవైపు బన్నీ రాకతో కిమ్స్‌ ఆస్పత్రి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కిమ్స్‌కు వస్తే చెప్పాలని అల్లు అర్జున్‌కు ఇప్పటికే రాంగోపాల్‌పేట్‌ పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వడంతో.. పోలీసుల అనుమతితో కిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లారు అల్లు అర్జున్‌. డిసెంబర్‌ 4న ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప-2 బెనిఫిట్‌ షో ప్రదర్శించారు. అయితే ఆ సమయంలో అల్లు అర్జున్‌ సినిమా థియేటర్‌కు రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన శ్రీతేజ్‌ తల్లి రేవతి మృతి చెందింది. శ్రీతేజ్‌కు తీవ్రగాయాలు కాగా అప్పటినుంచి బేగంపేట్‌ కిమ్స్‌లో చికిత్స కొనసాగుతోంది.

Tags:    

Similar News