Allu Arjun: కిమ్స్‌ ఆస్పత్రికి అల్లు అర్జున్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) నేడు సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లనున్నారు.

Update: 2025-01-07 02:28 GMT

Allu Arjun: కిమ్స్‌ ఆస్పత్రికి అల్లు అర్జున్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) నేడు సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లనున్నారు. ఉదయం 9.30 గంటలకు ఆయన వెళ్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను అల్లు అర్జున్‌ పరామర్శించనున్నారు. అయితే అల్లు అర్జున్ ఆస్పత్రికి వస్తే ముందుగానే పోలీసులకు (Police) తెలియజేయాలని పేర్కొంటూ ఇప్పటికే రాంగోపాల్ పెట్ పోలీసులు ఆయనకు ముందస్తు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

దీంతో బన్ని పోలీసులకు సమాచారం ఇచ్చి బేగంపేట కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. కాగా ఇప్పటికే బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ షరతులు పాటించాలని పోలీసులు సూచించారు. కాగా అల్లు అర్జున్‌‌కు హైదరాబాద్, రాంగోపాల్‌పేట్ పోలీసులు  మరోసారి నోటీసులు అందించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించాలంటే ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బాలుడిని చూసేందుకు ఎప్పుడు రావాలనుకున్నా.. ముందుగానే ఇన్‌ఫర్మేషన్ ఇవ్వాలని, ఆ తర్వాత మాత్రమే అక్కడికి వెళ్లాలని సూచించారు.

Tags:    

Similar News