Tollywood Actress: బాలీవుడ్ వైపు మొగ్గు చూపుతున్న హీరోయిన్స్..
Tollywood Actress: తెలుగులో అలరిస్తున్న పలువురు హీరోయిన్లు బాలీవుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు.
Tollywood Actress: తెలుగులో అలరిస్తున్న పలువురు హీరోయిన్లు బాలీవుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అలా ప్రస్తుతం బాలీవుడ్‌లో నటిస్తున్న, నటించిన టాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.
2020లోనే గుడ్ బై సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన రష్మిక అంతకుముందే పుష్పతో అక్కడి ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాల్లోని పాత్రలు పెద్దగా ఆమెకు గుర్తింపు ఇవ్వలేదు. గత ఏడాది సూపర్ హిట్ యానిమల్ మాత్రం నటిగా మరో స్థాయికి తీసుకుకెళ్లింది. ప్రస్తుతం రెండు భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌లో రష్మిక నటిస్తుంది. ఒకటి సల్మాన్ ఖాన్‌తో సికిందర్ కాగా మరొకటి విక్కీ కౌశల్ నటిస్తున్న హిస్టారికల్ డ్రామా చావా.
సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల అమరన్ మూవీతో సాయిపల్లవి హిట్ అందుకుంది. ఇక అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంతో సాయి పల్లవి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జపాన్‌లో శరవేగంగా జరుగుతుంది. సమ్మర్‌కి ఈ సినిమా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మరోవైపు ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన క్రేజీ ప్రాజెక్ట్ రామాయణంలో సీతగా కనిపించనుంది. ఈ మూవీకి చెందిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వరుస సినిమాలతో టాలీవుడ్‌లో శ్రీలీల బిజీగా ఉన్నారు. సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నా శ్రీలీలనే తీసుకోవడానికి హీరోలు, నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల పుష్ప2 సినిమాలో ఐటెం సాంగ్‌తో అదరగొట్టి బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. తమిళ్‌లో శివ కార్తికేయన్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే శ్రీలీల బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుందని ఎప్పట్నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఓ సినిమా కూడా సైన్ చేసిందని గతంలో వార్తలు వచ్చాయి. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వరుస హిట్స్‌తో బాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు కార్తీక్ ఆర్యన్. కార్తీక్ తాజాగా తు మేరీ మై తేరా అనే సినిమాని ప్రకటించారు. బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్స్ కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో సమీర్ విద్వాన్స్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుందని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.
భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి బింబిసార, సార్, విరూపాక్షి సినిమాలతో వరుస విజయాలు అందుకున్న మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ఇప్పుడు క్వీన్ ఆఫ్ క్వీన్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుడుపెట్టబోతోంది. మరి ఈ బాలీవుడ్ ఆఫర్ సంయుక్తకు ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మలలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ బ్యూటీ సందీప్ కిషన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ అనే మూవీతో మంచి విజయాన్ని అందుకుని తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కడం.. అందులో చాలా సినిమాలు మంచి విజయాలు సాధించడంతో అత్యంత తక్కువ కాలంలోనే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్లారు. పెళ్లి తర్వాత అవకాశాలు తక్కడంతో ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టారు. 2014లో యారియాన్‌తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం మేరే హస్బెండ్ కి బీవీ, దేదే ప్యార్ దే2లో నటిస్తున్నారు.
తెలుగులో పలు సినిమాలు చేసిన రాశీఖన్నా మద్రాస్ కేఫ్‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. గతేడాది యోధతో అలరించారు. ప్రస్తుతం విక్రాంత్ మస్సే సరసన ఓ సినిమాలో నటిస్తున్నారు. 2012లో ఏక్ దీవానా థాలో అతిథి పాత్రలో నటించిన సమంత.. ఫ్యామిలీ మ్యాన్ సీజన్2, సిటాడెల్: హన్నీ బన్నీ వెబ్ సిరీస్ లో నటించారు. ప్రస్తుతం రక్త్ బ్రహ్మండ్: ద బ్లడీ కింగ్ డమ్ సిరీస్‌లో నటిస్తున్నారు. కీర్తి సురేష్ గతేడాది బేబీజాన్ తో హిందీ ప్రేక్షకులను అలరించారు. ఇక మాళవిక మోహనన్ గతేడాది ముద్రతో హిందీలో అడుగుపెట్టారు. నయనతార 2023లో షారూక్ ఖాన్ జవాన్‌తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. రామన్ రాఘవన్ 2.0తో బాలీవుడ్ తోనే పరిశ్రమలోకి అడుగుపెట్టిన శోభితా ధూళిపాళ కిందటి ఏడాది లవ్, సితారతో అలరించారు.