NTR 31: ఎన్టీఆర్ కొత్త సినిమా సన్నాహాలు.. సంక్రాంతి తర్వాత షూటింగ్ ప్రారంభం
NTR 31: రీసెంట్‌గా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.
NTR 31: రీసెంట్‌గా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంచ్ చేశారు. ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపించి ఆకట్టుకోనున్నారు. ఐతే సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలో ప్రారంభమవుతుందని తాజాగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇంకా అధికారిక అప్‌డేట్ రానప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్‌గా మారింది. పైగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా ఎలా ఉండబోతుందంటూ తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా గురించి నిత్యం ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది. ఈ నెలలోనే తారక్ తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేయనున్నట్టు సమాచారం. ఈలోగానే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందనున్న కొత్త సినిమా పట్టాలెక్కనుంది.
ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా షూటింగ్ సంక్రాంతి తర్వాత కర్ణాటకలో స్టార్ట్ కానున్నట్టు సినీ వర్గాల టాక్. ఈ మూవీలో మలయాళ స్టార్లు టోవినో థామస్, బిజూ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్టు సమాచారం. అలాగే హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మూవీ టీమ్ నుంచి కార్లిటీ రావాల్సి ఉంది.