Pushpa 2 Box Office Collection Day 33: పుష్ప2 మరో అరుదైన రికార్డు.. 32 రోజుల్లో ఎంత రాబట్టిందో తెలుసా?

Pushpa 2 Box Office Collection Day 33: ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద పుష్ప2 సృష్టించిన చరిత్ర ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2025-01-07 07:31 GMT

Pushpa 2 Box Office Collection Day 33

Pushpa 2 Box Office Collection Day 33: ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద పుష్ప2 సృష్టించిన చరిత్ర ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్ల సినిమా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. డిసెంబర్‌ 4వ తేదీన ప్రీమియర్‌ షోలతో మొదలైన పుష్ప2 వసూళ్ల వర్షం ఇంకా కొనసాగుతూనే ఉంది.

కేవలం 32 రోజుల్లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు పుష్ప2 ఏకంగా 1831 కోట్లను రాబట్టింది. దీంతో బాహబలి 2 వసూళ్లను దాటేసిందీ మూవీ. దీంతో ఇండియన్‌ సినిమా హిస్టరీలో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రీరిలీజ్‌ బిజినెస్‌తోనే సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ సినిమా వసూళ్లు పెరిగాయి. అల్లు అర్జున్‌ నట విశ్వరూపం, సుకుమార్‌ వరల్డ్‌ క్లాస్‌ టేకింగ్‌ పుష్ప2 సినిమా విజయతీరాలకు చేర్చింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సంక్రాంతి సెలవులు ఉన్న నేపథ్యంలో పుష్ప2 కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జోరు కొనసాగితే పుష్ప2 రూ. 2వేల కోట్ల మార్క్‌ను దాటడం పెద్ద కష్టమేమి కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పుష్ప2 సరికొత్త అధ్యయనానికి తెర తీసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రం సాధించిన, సాధిస్తున్న వసూళ్లతో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ రేంజ్‌ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పెరిగింది.

బన్నీ నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌..

కాగా పుష్ప2 విజయంతో బన్నీ తర్వాత ప్రాజెక్టుపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. అల్లు అర్జున్‌ తర్వాత చేసే సినిమా ఏంటన్న దానిపై యావత్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. అల్లు అర్జున్‌ తన తర్వాత చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేపట్టనున్న విషయం తెలిసిందే. పుష్ప2 తర్వాత బన్నీ ఇమేజ్‌కు అనుగుణంగా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు తాజాగా నిర్మాత నాగవంశీ తెలిపారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఏకంగా ఓ స్టూడియోను నిర్మిస్తున్నట్లు తెలిపారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తొలి పాన్‌ ఇండియా మూవీగా ఇది రానుంది. 

Tags:    

Similar News