Meenakshi Chaudhary: ఆ ట్రోల్స్ వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా..

Meenakshi Chaudhary: ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న భామల్లో మీనాక్షి చౌదరి ఒకరు.

Update: 2025-01-06 11:17 GMT

Meenakshi Chaudhary: ఆ ట్రోల్స్ వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా..

Meenakshi Chaudhary: ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న భామల్లో మీనాక్షి చౌదరి ఒకరు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో జనవరి 14న ప్రేక్షకులను అలరించనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి చౌదరి.. తన లైఫ్‌లో ఎదుర్కొన్న కష్టతరమైన ఓ విషయాన్ని షేర్ చేసుకున్నారు. విజయ్‌తో కలిసి నటించిన ది గోట్ సినిమా విడుదలయ్యాక తనను చాలా మంది ట్రోల్ చేశారు. అవి చూసి ఎంతో బాధపడ్డానని ఆమె చెప్పారు. దీంతో వారం రోజులు డిప్రెషన్‌లోకి వెళ్లానని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

గోట్ సినిమా తర్వాత లక్కీ భాస్కర్ ఈ చిత్రం గొప్ప విజయాన్ని అందుకోవడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఈ సినిమాలో తన నటనకు ఎన్నో ప్రశంసలు లభించాయన్నారు. కథల ఎంపికలో మార్పులు చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నానని.. మంచి సినిమాలపై దృష్టి పెట్టాలని అర్థం చేసుకున్నానని ఆమె అన్నారు.

గతేడాది ఆరు సినిమాలతో సందడి చేసిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం ప్రచారంలో బిజీగా ఉన్నారు. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ఐశ్వర్యా రాజేశ్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం గురించి మాట్లాడిన మీనాక్షి కామెడీ జానర్ సినిమాలో నటించడం, యాక్షన్ సీక్వెన్స్‌లను చేయడం ఇదే తొలిసారని చెప్పారు. పోలీస్ రోల్ చేయాలనేది తన డ్రీమ్ అని కెరీర్ మొదట్లోనే ఆ అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించడం కొత్త అనుభూతినిచ్చిందన్నారు. నవీన్ పొలిశెట్టితో కలిసి అనగనగ ఒక రోజు చేస్తున్నట్టు తెలిపారు. మరో రెండు ప్రాజెక్టులు లైనప్‌లో ఉన్నాయని వాటి వివరాలు త్వరలోనే వివరిస్తానన్నారు మీనాక్షి చౌదరి. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదల చేసిన వెడ్డింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Tags:    

Similar News