Actress: ఈ యాంకర్‌ ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌..!

Actress: చిన్న స్థాయిలో కెరీర్‌ మొదలు పెట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది.

Update: 2025-01-06 11:05 GMT

Actress: ఈ యాంకర్‌ ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌..!

Actress: చిన్న స్థాయిలో కెరీర్‌ మొదలు పెట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. చిన్న సైడ్‌ క్యారెక్టర్‌గా ఆర్టిస్ట్‌లుగా కెరీర్ మొదలు పెట్టిన వారు హీరోలుగా రాణించారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి స్టార్‌ హీరోగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. ఇక ఇందుకు హీరోయిన్లు కూడా అతీతులేం కాదు. సాధారణ న్యూస్‌ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టి సినీ తారలుగా ఎదిగిన వారు ఉన్నారు.

ఇది చెప్పకగానే మనకు మొదట గుర్తొచ్చేది యాంకర్‌ అనసూయ. న్యూస్‌ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ కెరీర్‌లోనే అత్యంత ఉన్నత శిఖరాలకు చేరిన విషయం తెలిసిందే. అయితే మరో హీరోయిన్‌ కూడా అచ్చంగా ఇలాగే కెరీర్‌లో రాణించిందని మీకు తెలుసా.? పైన ఫొటోలో కనిపిస్తోన్న ఈ బ్యూటీనే ఆ హీరోయిన్‌. ఇంతకీ ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? ఓ ప్రముఖ ఛానల్లో న్యూస్ రీడర్‏గా పనిచేసింది. ఆ తర్వాత బుల్లి తెరపై ప్రేక్షకులను మెప్పించింది.

ఇప్పుడు వెండి తెరపై తనం అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది. ఇప్పటికే ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా.? ఈ చిన్నది మరెవరో కాదు కోలీవుడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్. 1989లో తమిళనాడులో జన్మించింది ప్రియా భవానీ శంకర్. మొదట్లో న్యూస్ ప్రజెంటర్ గా పనిచేసింది. పుతియ తలైమురైలో పనిచేసిన భవానీ ఆ తర్వాత పలు సీరియల్స్‌లో నటించి మెప్పించింది. ఆ తర్వాత వైభవ్ రెడ్డి హీరోగా వచ్చిన మేయదా మాన్ అనే సినిమాతో హీరోయిన్‌గా మారింది.

తొలి సినిమాతోనే ఉత్తమ నూతన నటిగా సైమా అవార్డ్ అందుకుంది. ఇక ఆ తర్వాత తమిళంలో వరుస సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తర్వాత తిరు సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన కళ్యాణం కమనీయం సినిమాతో తొలి తెలుగు స్ట్రెయిట్ మూవీ చేసింది. నాగ చైతన్య నటించి ధూత వెబ్‌ సిరీస్‌లో తళుక్కుమంది. ఇక తాజా జీబ్రా మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులోనూ పలు అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.


Tags:    

Similar News