Sankranti Movies 2025: ఈసారి సంక్రాంతి విజేత ఎవరు..?

Sankranti Movies 2025: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలకు సర్వం సిద్ధమైంది.

Update: 2025-01-06 09:16 GMT

Sankranti Movies 2025: ఈసారి సంక్రాంతి విజేత ఎవరు..?

Sankranti Movies 2025: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలకు సర్వం సిద్ధమైంది. ఒకవైపు సొంతూళ్లకు వెళ్లేవాళ్లు వాళ్ల హడావుడిలో ఉంటే మరోవైపు చిత్ర పరిశ్రమ సరికొత్త సినిమాలను విడుదల చేసే పనిలో ఉంది. అయితే ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. దీంతో అభిమానులకు సంక్రాంతి పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు విడుదలకానున్న నేపథ్యంలో సంక్రాంతి విజేత ఎవరనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఈ సారి ప్రేక్షకులను అలరించే చిత్రాలేంటో చూద్దాం.

రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. ఈ మూవీలో కియారా అద్వానీ రామ్ సరసన నటించారు. ఈ సంక్రాంతికి ప్రేక్షకులను అలరించనున్న మొదటి సినిమా ఇదే. రామ్ చరణ్ ఇందులో ద్విపాత్రాభినయంతో విభిన్న గెటప్పుల్లో తండ్రి కొడుకుగా కనిపించనున్నారు. అవినీతి రాజకీయ నాయకుడికి, ఓ కలెక్టర్‌కు మధ్య జరిగే యుద్ధమే ఈ చిత్రం కథ అని ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. అయితే శంకర్ సినిమాల్లో ఉండే బలమైన ఫ్లాష్ బ్యాక్ ఇందులోనూ కనిపించనుంది. అదేంటనేది తెరపైనే చూడాలి. రూ.400 కోట్ల బడ్జెట్‌తో దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం ఆకట్టుకోనుంది. ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది.

నందమూరి బాలకృష్ణ ఈ వయస్సులోనూ తన నటనతో యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. వరుస బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. తాజాగా బాబీ దర్శకత్వంలో రూపొందిన మాస్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం డాకు మహారాజ్. సితార ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకంపై సూర్య దేవర, నాగవంశీ, సాయి సౌజన్య రూ. 100 కోట్లతో నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలు. బాబీ దేవోల్, చాందిని చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరికొత్త పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక తమన్ మ్యూజిక్ మరో రేంజ్‌ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది.

యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ కలిపి సినిమాలు తీయడంతో అనిల్ రావిపూడి సిద్దహస్తుడు. అనిల్ దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్ర సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ కూడా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఇందులోని పాటలు యువతను విశేషంగా అలరించనున్నాయి. ఓ కుటుంబ కథలో క్రైమ్ కోణాన్ని ఆవిష్కరిస్తూ ఈ సినిమాను తీర్చిదిద్దినట్టు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. అటు భార్య, ఇటు మాజీ ప్రేయసి మధ్యలో నలిగిపోయే ఓ పోలీసు అధికారిగా వెంకటేష్ కనిపించనున్నారు. ఎఫ్2, ఎఫ్3 తర్వాత వెంకటేష్, అనిల్ కాంబినేషన్లో వస్తుండడంతో ఈ యాక్షన్ కామెడీ మూవీపై ప్రేక్షకుల్లో ప్రత్యేక దృష్టి నెలకొంది. ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది.

Tags:    

Similar News