Game Changer Ticket Hike: తెలంగాణలో గేమ్‌ఛేంజర్ టికెట్ రేట్స్ పెంపు.. అదనపు షోలకు అనుమతి..!
Game Changer Ticket Hike: గేమ్ ఛేంజర్ సినిమాకు టికెట్స్ రేట్స్ తో పాటు అదనపు షోలకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.
Game Changer Ticket Hike: గేమ్ ఛేంజర్ సినిమాకు టికెట్స్ రేట్స్ తో పాటు అదనపు షోలకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాటతో తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అదనపు షోలు ఉండవని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా కోసం వాటిని సడలిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సినిమా బడ్జెట్‌తో పాటు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత రేవంత్ సర్కార్.. గేమ్ ఛేంజర్ సినిమాకు టికెట్స్ రేట్స్ తో పాటు అదనపు షోలకు పర్మిషన్ ఇచ్చింది.
మొదటి రోజు మల్టీప్లెక్స్‌లో రూ.150, సింగిల్ థియేటర్లలో రూ.100 పెంచుతూ జీవో విడుదల చేసింది. జనవరి 11 నుంచి 19వ తేదీ వరకు మల్టీప్లెక్స్ లో రూ.100, సింగిల్ స్క్రీన్ లో రూ.50 అదనపు చార్జీల పెంపునకు అనుమతిచ్చింది. ఇక జనవరి 10వ తేదీ నుంచి 6వ షోకు, 11వ తేదీ నుంచి 5వ షో ప్రదర్శించుకునేలా జీవోను జారీ చేసింది. సినిమా పరిశ్రమ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు రిక్వెస్ట్‌ను సానుకూలంగా పరిశీలించినట్టు తెలుస్తోంది. సుమారు రూ.450 కోట్ల బడ్జెట్ పెట్టి గేమ్ ఛేంజర్ సినిమా నిర్మించారు.
ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవోతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిత్రయూనిట్ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధమైంది.