Shanker: ఆ హీరో బయోపిక్ తీస్తా.. శంకర్ ఆసక్తిర వ్యాఖ్యలు..!
Director Shankar: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా గేమ్ ఛేంజర్ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.
Director Shankar: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా గేమ్ ఛేంజర్ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే తాజాగా సినిమా దర్శకుడు శంకర్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన పలు ఆసక్తిర విషయాలను పంచుకున్నారు.
ఆయన దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ 2 ఆశించిన స్థాయిలో విజయాన్ని అందులేదన్న విషయం తెలిసిందే. దీంతో శంకర్ కొన్ని విమర్శలు కొదుర్కోవాల్సి వచ్చింది. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వీటిపై శంకర్ స్పందించారు. తాను ఎదుర్కొన్న విమర్శల గురించి మాట్లాడుతూ.. ‘‘విమర్శలను ప్రతిఒక్కరూ జీవితంలో ఏదోఒక సమయంలో ఎదుర్కోవాల్సిందే. వాటినుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఎవరైనా.. దేనినైనా విమర్శించొచ్చు. అయితే, వాటినుంచి మనం ఏం నేర్చుకున్నామనేది ముఖ్యం. ఆ విమర్శలను సవాలుగా తీసుకొని తర్వాత ప్రాజెక్ట్‌ను మెరుగ్గా తీయాలి. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’తో నేను బిజీగా ఉన్నాను. ఈ చిత్రం రిలీజ్ అయిన తర్వాత ‘భారతీయుడు 3’ పనులు ప్రారంభిస్తాను’’ అని చెప్పుకొచ్చారు.
ఇక భవిష్యత్తుల్లో బయోపిక్ తీయాల్సి వస్తే రజనీకాంత్ జీవిత చరిత్రను సినిమా తెరకెక్కిస్తానని శంకర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తనకు బయోపిక్ తీయాలన్న ఆసక్తి లేదని. అయితే ఒకవేళ భవిష్యత్తులో ఒకవేళ ఆ ఆలోచన వస్తే రజనీకాంత్ బయోపిక్ తీస్తానని చెప్పుకొచ్చారు. రజనీకాంగ్ గొప్ప వ్యక్తన్న విషయం ప్రతీ ఒక్కరికీ తెలుసని శంకర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. శంకర్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. రజనీ జీవితం సరిగ్గా సినిమాకు సరిపోయే కథ ఉంటుందంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే గేమ్ ఛేంజర్ ప్రీ బుకింగ్స్‌లో సత్తా చాటుతోంది. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేయగా హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున అమ్ముడు పోయాయి. ఒక గంటలో రూ.కోటి గ్రాస్ కలెక్షన్లు వసూళ్లు చేసిన సినిమాగా గేమ్ చేంజర్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.