చాహల్‌తో విడాకుల వార్తలపై ఎట్టకేలకు మౌనం వీడిన ధనశ్రీ.. ఇన్‌స్టాలో పోస్ట్ వైరల్

Dhanashree Verma: టీమ్ ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ విడాకులకు సిద్ధమవుతున్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

Update: 2025-01-09 09:53 GMT

Dhanashree Verma: టీమ్ ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ విడాకులకు సిద్ధమవుతున్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. గత కొన్నాళ్లుగా మీడియాలో వస్తున్న వార్తల వల్ల తాను ఎంతో మానసిక వేదనకు గురవుతున్నానని చెప్పుకొచ్చారు.

గత కొన్నాళ్లుగా తనతో పాటు తన కుటుంబ సభ్యులు క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. నిజానిజాలు తెలుసుకోకుండా అవాస్తవాలు రాస్తున్నారని.. తన ప్రతిష్టను దిగజార్చేలా.. తనపై ద్వేషం కలిగేలా ట్రోల్స్ చేస్తున్నారన్నారు. ఎన్నో ఏళ్లు కష్టపడితేనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. తాను మౌనంగా ఉన్నానంటే బలహీనంగా ఉన్నట్టు కాదన్నారు. సోషల్ మీడియాలో ప్రతికూలత ఉన్నప్పటికీ ఇతరులపై దయ, కరుణ చూపాలంటే అందుకు ధైర్యం అవసరం అన్నారు. తాను వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, విలువలతో ముందుకు సాగాలని అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. దాన్ని సమర్థించుకోవాల్సిన అవసరం లేదని ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ధనశ్రీ పోస్టు వైరల్ అవుతోంది.

చాహల్, ధనశ్రీ 2020లో వివాహం చేసుకున్నారు. ఇటీవల ఒకరినొకరు ఇన్‌స్టా‌గ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకున్నారు. చాహల్ తన ఖాతా నుంచి సతీమణి ఫొటోలు తొలగించడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. గతంలోనూ వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు వైరల్‌గా మారాయి. దీనిపై చాహల్ స్పందిస్తూ విడిపోవడం లేదని క్లారిటీ ఇచ్చారు.

Tags:    

Similar News