Vishal: హీరో విశాల్ ఆరోగ్యంపై వస్తున్న ఆ వార్తలు ఖండిస్తున్నాం: విశాల్ అభిమాన సంఘం

Vishal: హీరో విశాల్ ఆరోగ్యంపై కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న వార్తలపై నటుడి అభిమాన సంఘం స్పందించింది. అలాంటి తప్పుడు వార్తలను ఖండిస్తున్నాంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.

Update: 2025-01-11 00:22 GMT

Vishal: హీరో విశాల్ ఆరోగ్యంపై కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న వార్తలపై నటుడి అభిమాన సంఘం స్పందించింది. అలాంటి తప్పుడు వార్తలను ఖండిస్తున్నాంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.హీరో విశాల్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ ఇటీవల అధికారికంగా విడుదలైనా కూడా కొందరు కావాలని ఆయన ఆరోగ్యంపై దుష్ప్రచారం చేస్తున్నారని విశాల్ మక్కల్ నల ఇయక్కం పేర్కొంది. ఆ వార్తలను ఖండిస్తున్నామని..ప్రజలు అలాంటి తప్పుడు వార్తలను తిరస్కరించాలని అభిమాన సంఘం సూచించింది. ఎప్పుడు ప్రజల గురించే ఆలోచించే మా అభిమాన నటుడి ఆరోగ్యంపై కొందరు తప్పుడు సమాచారంతో కథనాలను ప్రచారం చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం కొందరు మీడియా ముసుగు వేసుకుని ఇలా ప్రవర్తిస్తున్నారంటూ పేర్కొంది.

ఈమధ్యే చెన్నైలో జరిగిన తన మూవీ మదగజరాజ ఈవెంట్లో విశాల్ అనారోగ్యంగా వణుకుతూ కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. సంబంధిత వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో విశాఖ వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నారని వైద్యులు కొన్ని రోజులపాటు రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లు హెల్త్ బులిటెన్ కూడా విడుదలయ్యింది. అయినా కూడా కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్లు విశాల్ కు తీవ్ర అస్వస్థత అంటూ వార్తలు రాయడంతో అభిమానం సంఘం స్పందించింది.

విశాల్ కు ఢిల్లీలో ఉన్నప్పుడే జ్వరం వచ్చింది. ఆ విషయం ఎవరికీ తెలియదని కానీ మదగజరాజ మూవీ 11 సంవత్సరాల తర్వాత విడుదల అవుతుందని అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈవెంట్ కు వచ్చారు. ఆ రోజు విశాల్ డెంగీ ఫీవర్ తో బాధపడుతున్నారు. జ్వరంతో ఎందుకు వచ్చారని అడిగితే 11ఏళ్ల తర్వాత ఇది ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అందుకే ఈ వేడుకకు కచ్చితంగా రావాలనుకున్నాను అని చెప్పారు. 103 డిగ్రీల జ్వరం కారణంగా వణికిపోయారు. ఆ ఈవెంట్ పూర్తవ్వగానే మేము విశాల్ ను ఆసుపత్రికి తీసుకెళ్లాము. ఇప్పుడు ఆయన కోలుకుంటున్నారు ..ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అని ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా ఖుష్బు భర్త సుందర్ డైరెక్షన్ లో రూపొందిన మదగజరాజ ఈ నెల 12న రిలీజ్ కానుంది. 

Tags:    

Similar News