Upasana Konidela: ‘మై డియరెస్ట్ హజ్బెండ్... కంగ్రాచ్యులేషన్స్!’
రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న విడుదలైంది.
గేమ్ చేంజర్ సినిమాలో రామ్‌చరణ్ నటనపై మీడియాలో వచ్చిన ప్రశంసలతో డిజైన్ చేసిన గ్రాఫిక్ కార్డుతో, “కంగ్రాచ్యులేషన్స్ మై డియరెస్ట్ హజ్బెండ్, మీరు ప్రతి విషయంలోనూ నిజంగా గేమ్ చేంజరే” అని ఉపాసన కొణిదెల చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
లవ్ యూ అంటూ ఇమోజీలతో ఉపాసన తన భర్త రామ్‌చరణ్ మీద ప్రేమవర్షం కురిపించారు. కమర్షియల్ జానర్‌లో పక్కాగా ఎగ్జిక్యూట్ చేసిన సినిమా అంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా, రెండు పాత్రల్లో రామ్ చరణ్ పవర్ హౌజ్ పర్ఫామెన్స్ డెలివర్ చేశారంటూ ది హన్స్ ఇండియా, బలమైన క్యారెక్టర్లతో తయారైన పొలిటికల్ పవర్ ప్యాక్డ్ డ్రామా అంటూ ది గ్లిట్జ్ తదితర పత్రికలు రాసిన వాక్యాలతో ఉన్న గ్రాఫిక్ కార్డును ఆమె తన పోస్టుకు అటాచ్ చేశారు.
రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న విడుదలైంది. ఈ చిత్రం రామ్‌చరణ్ కెరీర్లో ఫస్ట్ డే కలెక్షన్లలో రికార్డు సృష్టించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఉపాసన ట్వీట్‌కు 5 లక్షల వ్యూస్, 36 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. దాదాపు 7 వేల మంది దీన్ని రీపోస్ట్ చేశారు.