SSMB29లో ట్విస్టుల మీద ట్విస్టులు.. మహేష్‌కు అన్నగా వెంకటేష్..
ప్రిన్స్ న్యూ లుక్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించాలని రాజమౌళి కూడా ప్లాన్ చేస్తూ నటీనటుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రాజమౌళి, మహేష్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ SSMB29. ఈ సినిమా గురించి మొదటి నుంచి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. రాజమౌళి, మహేష్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం మహేష్ తన లుక్ ను మార్చేశారు. ప్రిన్స్ న్యూ లుక్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించాలని రాజమౌళి కూడా ప్లాన్ చేస్తూ నటీనటుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఈ మూవీ గురించి మరో వార్త వినిపిస్తోంది.
SSMB29లో మహేష్ బాబుకు అన్నగా విక్టరీ వెంకటేష్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇటు మహేష్ ఫ్యాన్స్, అటు వెంకటేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకే మహేష్, వెంకటేష్ కాంబోలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్‌లో అప్పట్లో మంచి మార్కులే పడ్డాయి. మళ్లీ ఇప్పుడు వీరిద్దరూ కలిసి స్క్రీన్ మీద కనిపించబోతున్నారనే వార్తతో వారి అభిమానుల ఖుషీ అవుతున్నారు. ఈ వార్త నిజమైతే మహేష్, వెంకీ క్రేజీ కాంబో మరోసారి నెక్ట్స్ లెవల్‌కు వెళ్లడం మాత్రం పక్కా అంటున్నారు. అయితే దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
ఇక ఆర్ఆర్ఆర్‌తో గ్లోబల్ సక్సెస్ కొట్టిన రాజమౌళి ఇప్పుడు SSMB29తో హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందనే టాక్.ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా బయటకు రాలేదు. రాజమౌళి దర్శకత్వంలో విజయేంద్ర ప్రసాద్ అందించిన కథతో సినిమా చేస్తున్నారు. ఇండియానా జోన్స్ తరహా సినిమా అని విజయేంద్ర ప్రసాద్ పలు సందర్భాల్లో లీక్స్ ఇవ్వడమే తప్ప.. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.
ఇదిలా ఉంటే ఈ మూవీలో మహేష్ సరసన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, విలన్ క్యారెక్టర్‌లో మలయాళ సూపర్ స్టార్ పృథ్విరాజ్ సుుమారన్ నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వెంకటేష్ విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14 విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు.