The Raja Saab: రాజాసాబ్ స్పెషల్ పోస్టర్.. పెళ్లి కొడుకులా ఉన్నావంటూ నెటిజన్స్ కామెంట్స్

The Raja Saab: ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం రాజాసాబ్.

Update: 2025-01-14 07:14 GMT

The Raja Saab: రాజాసాబ్ స్పెషల్ పోస్టర్.. పెళ్లి కొడుకులా ఉన్నావంటూ నెటిజన్స్ కామెంట్స్

The Raja Saab: ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం రాజాసాబ్. సంక్రాంతి కానుకగా ఈ సినిమా నుంచి మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. హ్యాపీ సంక్రాంతి డార్లింగ్స్.. మనం ఎప్పుడు వస్తే అప్పుడే అసలైన పండుగ.. త్వరలో చితక్కొట్టేద్దాం అంటూ మేకర్స్ రాసుకొచ్చారు. ఇప్పుడీ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లో కళ్లద్దాలు పెట్టుకుని నవ్వుతున్న ప్రభాస్ ఫొటోను చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ను స్టైలిష్‌గా చూపించారంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అచ్చం పెళ్లి కొడుకులా రెడీ అయ్యాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

రాజాసాబ్ మూవీలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్‌లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా హారర్ కామెండీ జానర్‌లో ఏప్రిల్ 10న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ జపాన్‌లో చేయబోతున్నారంటూ తమన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో జపనీస్ వెర్షన్‌లో ఓ పాట చేయాలని మూవీ మేకర్స్ తనను కోరినట్టు తెలిపారు.

ప్రభాస్ రాజాసాబ్ మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ తొలిసారి హారర్ జానర్ చేస్తున్నారు. దీంతో రాజాసాబ్ మూవీపై హైప్ మరింత ఎక్కువగా ఉంది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సంక్రాంతి సందర్భంగా చిత్ర బృందం రిలీజ్ చేసిన పోస్టర్.. ప్రభాస్ అభిమానుల్లో అంచనాలు మరింత పెంచింది. చూడాలి మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో.



Tags:    

Similar News