Anshu: ఆ డిబేట్‌కు ఫుల్‌స్టాప్ పెట్టండి.. త్రినాథరావు కామెంట్స్‌పై స్పందించిన నటి అన్షు

Anshu: దర్శకుడు త్రినాథరావు నక్కిన తనపై చేసిన కామెంట్స్‌పై నటి అన్షు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

Update: 2025-01-14 08:04 GMT

Anshu: ఆ డిబెట్‌కు ఫుల్‌స్టాప్ పెట్టండి.. త్రినాథరావు కామెంట్స్‌పై స్పందించిన నటి అన్షు

Anshu: దర్శకుడు త్రినాథరావు నక్కిన తనపై చేసిన కామెంట్స్‌పై నటి అన్షు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. త్రినాథరావు చాలా మంచి వ్యక్తి. ఆయన దర్శకత్వంలో నేను రీ ఎంట్రీ ఇస్తున్నందుకు సంతోషిస్తున్నా. త్రినాథరావుపై నాకు ఎలాంటి కోపం లేదు. నన్ను ఫ్యామిలీ మెంబర్‌లాగా చూసుకున్నారు. ఆయన సూచనలు, సలహాలు నాకు ఉపయోగపడ్డాయి. దయచేసి ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరుకుంటున్నట్లు అన్షు చెప్పారు.

సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మజాకా సినిమాలో అన్షు కీలక పాత్ర పోషించారు. అయితే హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో అన్షు శరీరాకృతి గురించి త్రినాథరావు మాట్లాడడం చర్చనీయాంశమైంది. మన్మథుడు చిత్రంలో ఆమెని చూడడం కోసమే థియేటర్స్‌కి వెళ్లేవాళ్లం.. లడ్డూలా ఉండేది.. ఇప్పుడు కాస్త సన్నబడింది. తెలుగులో నటించాలంటే కొంచెం బొద్దుగా ఉండాలంటూ అన్షు శరీరాకృతి గురించి త్రినాథరావు చీప్ కామెంట్స్ చేశారు. త్రినాథరావు కామెంట్స్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడ్డారు. మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. సుమోటోగా ఆయనకు నోటీసులు పంపబోతున్నట్టు పేర్కొంది.

అయితే అన్షుతో పాటు తన మాటల వల్ల బాధపడ్డ మహిళలందరికీ త్రినాథరావు క్షమాపణలు చెబుతూ జనవరి 13వ తేదీన ఓ వీడియో విడుదల చేశారు. త్రినాథరావు వ్యాఖ్యలపై చర్చ జరిగిందని అన్షు దృష్టికి వెళ్లడంతో ఈ వివాదంపై ఆమె స్పందించారు. త్రినాథరావు అంటే తనకు ఎంతో గౌరవం అని, అతను చాలా మంచివారు అని చెప్పింది. ఈ కామెంట్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరింది.

మన్మథుడు తర్వాత ప్రభాస్‌తో రాఘవేంద్ర సినిమాలో నటించిన అన్షు.. ఆ తర్వాత సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టి, పెళ్లి చేసుకుని ఫారిన్ వెళ్లిపోయింది. 21 ఏళ్ల తర్వాత మళ్లీ మజాకా సినిమా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News