Actress: గోపాల గోపాలలో 'గోపికా మాత' గుర్తుందా.? ఇప్పుడెలా ఉందో తెలిస్తే..!
పవన్ కళ్యాణ్, వెంకటేష్‌లు కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ 'గోపాలగోపాల' ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Gopala Gopala Movie: పవన్ కళ్యాణ్, వెంకటేష్‌లు కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ 'గోపాలగోపాల' ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. తమ హీరోయిజాన్ని పక్కన పెట్టి మరీ ఇద్దరు హీరోలు కలిసి నటించి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. దేవుడు, మనిషికి మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా ఉంటుంది.
బాలీవుడ్‌లో సంచలన విజయాన్ని అందుకున్న ఓ మై గాడ్ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను2015లో తీసుకొచ్చారు. కిషోర్ పార్థసాని అద్భుత దర్శకత్వం, వెంకీ, పవన్‌ల నటన సినిమాను విజయ తీరాలకు చేర్చింది. ఈ సినిమాలో బాబా పాత్రల్లో నటించిన వారు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిలో లేడీ బాబా పాత్ర కూడా ఉంది. గోపికా మాత పాత్ర సినిమాకు ప్లస్ పాయింట్స్‌లో ఒకటిగా చెప్పొచ్చు.
ఈ పాత్రలో దీక్ష పంత్ నటించి మెప్పించారు. ఒరేయ్ గోపాల్ రావ్ అంటూ ఆమె చేసిన రచ్చ మాములుగా ఉండదు. దీక్ష పంత్ ఈ సినిమా కంటే ముందే ఇండస్ట్రీకి పరిచయమైంది. ‘వరుడు’ ‘రచ్చ’ ‘ఒక లైలా కోసం’ వంటి సినిమాల్లో నటించిన విషయం చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఇక ఆపరేషన్ 2019 సినిమాలో కూడా నటించింది. అయితే ఈ సినిమాలేవి విజయం సాధించకపోవడంతో ఈ బ్యూటీ పేరు పెద్దగా వినిపించలేదు.
ఇదిలా ఉంటే దీక్ష పంత్ బిగ్‌బాస్‌లో కూడా పాల్గొంది. సీజన్ 1లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ షోలో కూడా ఈ బ్యూటీ ఇమేజ్‌కి పెద్దగా ప్లస్ కాలేదని చెప్పాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చేసిన కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. ఇంతకీ బ్యూటీ ప్రస్తుతం ఎలా ఉందో ఓసారి చూసేయండి.