Shobita Dhulipala: శోభితను ఏకిపారేస్తున్న నెటిజన్లు.. సంప్రదాయం ఇష్టమంటూనే ఈ పనేంటి అంటూ ఫైర్

Update: 2025-01-15 03:23 GMT

Shobita Dhulipala: అక్కినేని నాగచైతన్యం, శోభిత ధూళిపాళ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సంక్రాంతి సందర్భంగా శోభిత సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు వైర్లు అవుతోంది. ఆ పోస్టు చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో నాగచైతన్య, సమంతలు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ విడాకులు తీసుకున్నారు. ఇక సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత శోభితను నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫొటోలను అక్కినేని ఫ్యామిలీ విడుదల చేసింది. ఇక ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే శోభిత పర్సనల్ లైఫ్ కు వస్తే కొన్నేళ్ళ కిందట వీరి కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడింది. శోభిత బాల్యం అంతా ముంబైలోనే. మోడలింగ్ పై ఇంట్రెస్ట్ ఉన్న శోభిత తనను సినీ ఇండస్ట్రీకి వచ్చేలా చేసింది. ఎంతో కష్టపడి తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. యాడ్స్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసి..జూనియర్ ఆర్టిస్టుగా చేస్తూ హీరోయిన్ గా రాణిస్తోంది.




 

ఇక తెలుగు సాంప్రదాయలను పాటిస్తూ ఎప్పుడూ చీరల్లో కనిపించే శోభిత..తన పెళ్లికి పసుపు దంచడం నుంచి పెళ్లివరకు పద్దతిగా కనిపిస్తూ అందర్నీ మెప్పించింది. పెళ్లినికూడా పాత పద్ధతిలోనే జరిగింది. కానీ అదంతా పెళ్లి వరకే పరిమితమంటూ చెప్పకనే చెప్పింది. అక్కినేని వారసుడ, శోభిత సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకున్నారు. తాజాగా శోభిత ఓ ఫొటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంట్లో శోభిత ఎర్ర రంగు చీరలో అద్దం ముందు సెల్పీ తీసుకుని పోస్టు చేసింది.




 

అంతేకాదు నాగచైతన్య, శోభితా కాళ్ల ఫొటోలను కూడా షేర్ చేస్తూ తమ ఇంట్లో సంక్రాంతి సంబురాలు ఇలా జరిగాయంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడే దొరికిపోయింది శోభిత. పెళ్లి జరిగి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు కాళ్లకు మెట్టెలను తీసేసి కనిపించిందంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నాగాచైతన్య మెట్టెలు పెట్టినప్పుడు ఎమోషనల్ అయ్యావు. ఇప్పుడు అవి తీసేపావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎంగేజ్ మెంట్ నుంచి సాంప్రదాయంగా కనిపించావు. మరి ఇప్పుడు ఈ సాంప్రదాయలు ఏవి అంటూ కామెంట్ల వర్షం కురుపిస్తున్నారు. కాలికి మెట్టెలు తీయకూడదనే విషయం తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం శోభితకు సపోర్టు చేస్తున్నారు. ఆమెకు లేని బాధ మీకెంటీ అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.




Tags:    

Similar News