Daaku Maharaaj: డాకు మహారాజ్.. వివాదాస్పద స్టెప్స్‌పై స్పందించిన ఊర్వశీ రౌతేలా

Daaku Maharaaj: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబి కాంబోలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సినిమా డాకు మహారాజ్.

Update: 2025-01-16 12:56 GMT

Daaku Maharaaj: డాకు మహారాజ్.. వివాదాస్పద స్టెప్స్‌పై స్పందించిన ఊర్వశీ రౌతేలా

Daaku Maharaaj: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబి కాంబోలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సినిమా డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన డాకు మహారాజ్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తమన్ మ్యూజిక్, పాటలకు మంచి స్పందన వచ్చింది. ఊర్వశీ రౌతేలా, బాలకృష్ణ దబిడి దిబిడి సాంగ్ ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. అయితే ఇందులో ఓ స్టెప్ వివాదాస్పదంగా మారింది. తాజాగా దీనిపై ఊర్వశీరౌతేలా ఓ ఆంగ్ల మీడియాలతో మాట్లాడారు.

ఒక సినిమా విజయం సాధించినప్పుడు దానిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. నేను ఈ విషయాన్ని అర్థం చేసుకోగలను. బాలకృష్ణతో డ్యాన్స్, నటనకు ప్రాధాన్యం ఉండే ఎలాంటి భిన్నమైన సినిమాలనైనా నేను గౌరవిస్తాను. బాలకృష్ణ లెజెండ్. ఆయనతో కలిసి వర్క్ చేసే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఇదంతా కళలో భాగం. బాలకృష్ణతో డ్యాన్స్ చేయడం కేవలం పెర్ఫామెన్స్ కాదు. కళపై నాకున్న గౌరవానికి చేసుకున్న వేడుకగా భావిస్తాను. బాలకృష్ణతో పనిచేయడం నా కల. అది ఈ సినిమాతో నెరవేరింది. బాలకృష్ణ ఆర్టిస్టులకు ఎంతో సపోర్ట్ చేస్తారు అని అన్నారు.

ఈ పాట విడుదలైనప్పుడు వచ్చిన ట్రోల్స్ పై కూడా ఊర్వశీ ఇటీవల స్పందించారు. జీవితంలో ఏం సాధించలేని కొందరు.. కష్టపడే వారిని విమర్శించే అర్హత ఉందనుకుంటారు. రియల్ పవర్ అంటే ఇతరులను విమర్శించడం కాదు.. వారి గొప్పతనాన్ని ఆదర్శంగా తీసుకోవడం అని ఓ నెటిజన్‌కు ఘాటు రిప్లై ఇచ్చారు.

బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు ఈ చిత్రం రూ.56 కోట్లు వసూళ్లు చేసింది. దీంతో బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్టులో డాకు మహారాజ్ చేరింది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతుల హీరోయిన్లుగా నటించగా.. బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

ఇదిలా ఉంటే నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో రాణిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హిట్ అందుకున్న బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాడు.

Tags:    

Similar News