Pushpa 2: పుష్ప2 అందుకే హిట్ అయింది.. లేదంటే.. బాలీవుడ్‌ దర్శక నిర్మాత రాకేష్ రోషన్

Pushpa 2: అల్లు అర్జున్‌ హీరోగా, సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన పుష్ప2 చిత్రం ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2025-01-16 08:01 GMT

Pushpa 2: పుష్ప2పై విషం చిమ్మిన బాలీవుడ్‌ దర్శక,నిర్మాత.. ఏమన్నారంటే..?

Pushpa 2: అల్లు అర్జున్‌ హీరోగా, సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన పుష్ప2 చిత్రం ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాసిందీ మూవీ. సుకుమార్‌ మార్క్‌ దర్శకత్వం, బన్నీ అద్భుత నటన ఈ సినిమాను విజయ తీరాలకు చేర్చింది. విడుదలైన తొలి రోజు నుంచే అన్ని చోట్ల ఈ సినిమా ఊహించని కలెక్షన్లను రాబట్టింది.

ఇప్పటికే రూ. 1800 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిన పుష్ప2 చిత్రం బాహుబలి2 రికార్డును సొంతం చేసుకుంది. ఇక రూ. 2 వేల కోట్లు రాబట్టే దిశగా వేగంగా దూసుకుపోతోంది పుష్ప2. బాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఏ బాలీవుడ్‌ మూవీ సాధించని రూ. 1000 కోట్ల వసూళ్లను రాబట్టిందీ మూవీ.

ఆమిర్ ఖాన్ దంగల్ సినిమా రికార్డును బద్దలు కొట్టే దిశగా అడుగులు వేస్తోందీ మూవీ. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత, హీరో హృతిక్ రోషన్ తండ్రి రాకేష్‌ రోషన్‌ పుష్ప2, కేజీఎఫ్ 2 సినిమాల గురించి సౌతిండియా సినిమాలపై పలు కామెంట్స్ చేశారు. దక్షిణాది సినిమాలు మూస పోకడలతో ఉంటున్నాయని ఆరోపించారు.

‘పుష్ప 2తో సహా దక్షిణాది సినిమాలన్నీ పాత కాలం నాటి సాంగ్-యాక్షన్-డైలాగ్-ఎమోషన్స్ పోకడలనే ఇంకా అనుసరిస్తున్నాయని అన్నారు. ఆ పాత పద్ధతిలోంచి బయటికి రావడం లేదు.. కొత్త ప్రయోగాలు చేయడం లేదు కనుకే వారు సక్సెస్ అవుతున్నారని రాకేష్ రోశన్ అభిప్రాయపడ్డారు. ఇది ముమ్మాటికీ పుష్ప2 విజయాన్ని చూసి ఓర్వలేక ఇలాంటి కామెంట్స్‌ చేస్తున్నారంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే పుష్ప2 రీలోడెడ్‌ వెర్షన్‌ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. అదనంగా మరో 20 నిమిషాల సన్నివేశాలను జోడించి రిలీజ్‌ చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ సీన్స్‌ను జనవరి 17వ తేదీ నుంచి విడుదల చేయనున్నారు. దీంతో పుష్ప2 వసూళ్లు మరింత పెరగడం ఖాయమనే ధీమాతో ఉంది చిత్ర యూనిట్‌.

Tags:    

Similar News