Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి జరిగింది. నిందితులు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించి కత్తితో పొడిచేందుకు ప్రయత్నించారు. ఈ దాడిలో సైఫ్ అలీఖాన్ గాయపడ్డాడు. అనంతరం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం నిందితులు దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో దొంగలకు సైఫ్ అలీఖాన్ ఎదురవ్వడంతో దాడికి దిగినట్లు సమాచారం. దుండగుల దాడిలో గాయపడిన సైఫ్ అలీఖాన్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.