గత ఏడాది ఎఫ్ 2, వెంకీమామ చిత్రలలతో మంచి సక్సెస్ అందుకున్నాడు సీనియర్ హీరో వెంకటేష్ ... ప్రస్తుతం తమిళ్ లో ధనుష్ , మంజు వారియర్ కలిసి నటించిన అసురన్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా అక్కడ మంచి హిట్ అవడం, వెంకటేష్ దీనిని రీమేక్ చేస్తుండడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మాతలు అయిన సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను కలిసి సంయుక్తంగా నిమిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి నటిస్తోంది.
మరో రెండు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. సినిమా షూటింగ్ ని ఎక్కువ భాగం అనంతపురంలో తీయనున్నారు. అయితే ఈ సినిమాకు లేటెస్ట్ గా 'నారప్ప' అనే టైటిల్ ని పరీశిలిస్తునట్టుగా తెలుస్తోంది. అంతకుముందు అసురుడు అనే టైటిల్ ని అనుకున్నప్పటికీ ఈ సినిమాలో హీరో వెంకటేష్ పాత్ర పేరు నారప్ప కావడంతో అదే సినిమాకి ఈ టైటిల్ పెట్టలని అనుకుంటునట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాని ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 కి సీక్వెల్ చేయనున్నారు. ఇందులో వెంకటేష్ తో పాటు వరుణ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. ఎఫ్ 2 సినిమాని నిర్మించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. .