Raghava Lawrence: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్‌..

Raghava Lawrence: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్‌..

Update: 2024-04-18 07:30 GMT

Raghava Lawrence: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్‌.. 

Raghava Lawrence: దివ్యాంగులు, అనాథ బాలల కోసం పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు నటుడు, నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్‌. తాజాగా ఆయన మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. దివ్యాంగుల కోసం ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి ఇచ్చారు. దివ్యాంగులైన వీరందరూ మల్లరకంభంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారని ఇటీవల నేనొక ప్రెస్‌మీట్‌లో చెప్పిన విషయం తెలిసిందే. చేసే పని పట్ల వారికి ఉన్న పట్టుదల చూసి సంతోషిస్తున్నాను.

వారందరికీ బైక్స్‌ ఇవ్వడంతోపాటు ఇళ్లు కట్టిస్తానని నేను మాటిచ్చా. అందులో భాగంగా 13 ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి ఇచ్చా. వారికి ఉపయోగపడేలా ఆ వాహనాలను త్రీవీలర్స్‌గా మార్పించనున్నాం. అదే విధంగా, ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే ఇళ్లు కూడా నిర్మిస్తా’’ అని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో షేర్‌ చేశారు. రాఘవ చేసిన పనితో వారందరూ ఆనందం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News