Live Updates: ఈరోజు (06 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 06 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 06 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | షష్ఠి రా.2-33 తదుపరి సప్తమి | పునర్వసు నక్షత్రం తె.4-31 తదుపరి పుష్యమి | వర్జ్యం సా.4-09 నుంచి 5-48 వరకు | అమృత ఘడియలు రా.2-05 నుంచి 3-41 వరకు | దుర్ముహూర్తం ఉ.8-20 నుంచి 9.05 వరకు తిరిగి మ.12-06 నుంచి 12-52 వరకు | రాహుకాలం ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.06-04 | సూర్యాస్తమయం: సా.05-24
ఈరోజు తాజా వార్తలు
విజయవాడ
- పీక కోసి పరారైన లారీ డ్రైవర్
- బాధితుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
- పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
చిత్తూరు...
- కుప్పం నియోజకవర్గం మండలం కృష్ణ దాసనపల్లి పరిసర ప్రాంతాల్లో క్షుద్రపూజల కలకలం
- సురేష్ వ్యక్తికి తీర్థం త్రాగించి పూజలు చేస్తుండగా స్పృహ తప్పి పడిపోయిన సురేష్
- వెంటనే గమనించి స్థానికులు సురేష్ నీళ్ళు చల్లి కాపాడిన స్థానికులు
- క్షుద్ర పూజలు నిర్వహించిన వ్యక్తులు అనంతపురం, బోయకొండకు చెందిన వ్యక్తులుగా చెబుతున్న గ్రామస్తులు
హోంమంత్రి, మేకతోటి సుచరిత
-జీవిత ఖైదు అనుభవిస్తూ ఉన్న వారిని, కొన్ని ప్రత్యేక కేసులలో జైళ్ళలో ఉన్న వారిని విడుదల చేస్తున్నాం
-క్షణికావేశంలో వారు చేసిన నేరంతో జైళ్ళకు వెళ్ళి ఉంటారు
-ఐదు సంవత్సరాల ఖైదు, శిక్ష కాలం పూర్తి చేసుకున్నవారు విడుదల అవుతున్నారు
-147మంది మహిళ ఖైదీలలో 55 మంది అర్హులను విడుదల చేస్తున్నాం
-జీఓఎంఎస్ నం.131 ప్రకారం ఈ మార్గదర్శకాలు విడుదల చేసాం
-డిగ్రీ చదివిన, చదువుతున్న 6గురు మహిళ ఖైదీలు ఉన్నారు.
-కుట్టు, ఎంబ్రాయిడరీ, అల్లికలు వంటి చేతి వృత్తులు కూడా శిక్షణ ఇస్తున్నాం
విజయవాడ
- ఏపీ జైళ్ళ డీజీ, అహసన్ రెజా
- ఓ మహిళ ఖైదు కావడంతో ఓ కుటుంబం ఇబ్బంది పడుతుంది
- సీఎం జగన్ నిర్ణయంతో ఈ నిర్ణయం తీసుకున్నాం
- ఖైదు, శిక్ష కాలం ఐదు సంవత్సరాలకు తగ్గించాం
కడప :
- దగ్గర బంధువుల మధ్య ఘర్షణ
- వెంకటరామిరెడ్డి ని కత్తి తో నరికిన సంజీవరెడ్డి.
- వెంకటరామిరెడ్డి త్రీవ గాయాలు, పరిస్థితి విషమం తిరుపతి హాస్పిటల్ కి తరిలింపు, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పుల్లంపేట పోలీసులు
పశ్చిమ గోదావరి జిల్లా
// జిల్లాలో ఇప్పటివరకు 183 మంది టీచర్లు, 280 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.
// జిల్లాలో ఈ ఒక్క రోజు 6గురు టీచర్లకు 3 విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ
అమరావతి
- తాడేపల్లిగూడెం మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ రాజును సస్పెండ్ చేసిన రవాణా కమీషనర్ పీఎస్ఆర్ ఆంజనేయులు
- వాహన తనిఖీలలో అవినీతి బుట్టదాఖలు కావడంతో గంటలోనే చర్యలు తీసుకున్న కమీషనర్
పశ్చిమ గోదావరి జిల్లా
- పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా భీమవరం నియోజకవర్గంలో ప్రారంభమైన పాదయాత్ర
- పట్టణంలో 3 వ వార్డులో పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
- హారతి ఇచ్చి స్వాగతం పలికిన వాలంటరీస్ ,వార్డు మహిళలు భారీగా పాల్గొన్న వైస్సార్సీపీనాయకులు ,కార్యకర్తలు
నెల్లూరు :--
-- బైక్ పై వెళ్తున్న నిరీక్షణ అనే యువకుడు ని డి కొట్టిన లారీ
--ప్రమాదం లో నుజ్జునుజ్జు అయిన యువకుడి రెండు కాళ్ళు.
-- హుటాహుటిన హాస్పిటల్ కి తరలించిన స్థానికులు.
-- యువకుడి పరిస్థితి విషమం.
విజయవాడ...
- 24 గంటలు సమయం ఉండటం తో నిందితుడి నుంచి వాస్తవాలు రాబట్టే పనిలో పడ్డ దిశా టీం
- రెండుగంటలుగా సాగుతున్న విచారణ
- హత్యకు గల కారణాలపై అరా
- నాగేంద్ర నుండి కీలక విషయాలు రాబడుతున్న పోలీసులు
- కోర్టు సమయం ముగియటం తో న్యాయమూర్తి ఇంటివద్దే నాగేంద్రను హాజరు పరిచే అవకాశం