Live Updates: ఈరోజు (06 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-11-06 01:33 GMT
Live Updates - Page 2
2020-11-06 14:00 GMT

Kadapa District Updates: జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ ఆపరేషన్..

  కడప :

- జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి సర్కిల్ రామాపురం పరిధిలోని పాలకొండ అటవీ ప్రాంతంలో గత 48 గంటలుగా పోలీసుల కూంబింగ్ ఆపరేషన్..

- పోలీసుల అలికిడి విని పరారైన తమిళ కూలీలు.. ఘటనా స్థలంలో 10 దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు..

- పరారైన తమిళ కూలీల కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసు బృందాలు..

2020-11-06 13:56 GMT

West Godavari Updates: జీలుగుమిల్లి చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు..

పశ్చిమ గోదావరి జిల్లా....

- జీలుగుమిల్లి చెక్ పోస్ట్ మరియు నేర్సుగూడెం గ్రామ శివారుల లో వాహన తనిఖీలు చేపట్టిన జీలుగుమిల్లి పోలీసులు.

- తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రా కి అక్రమం గా మద్యాన్ని తరలిస్తున్న నలుగురిని పట్టుకున్న పోలీసులు.

- వారి వద్ద నుండి ₹ 13,950/- విలువైన 22 మద్యం బాటిళ్లు , రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం.

- కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న జీలుగుమిల్లి పోలీసులు.

2020-11-06 13:50 GMT

National Updates: ఢిల్లీ పర్యటనలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి..

  జాతీయం

// కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటి అయిన బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి.

// పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల విడుదలపై కేంద్రమంత్రితో చర్చించనున్న బుగ్గన

2020-11-06 13:31 GMT

Nellore Updates: సూళ్లూరుపేట శ్రీ చెంగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన రాజ్యసభ సభ్యులు..

నెల్లూరు:

--- సూళ్లూరుపేట శ్రీ చెంగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి, టిటిడి బోర్డు సభ్యులు ప్రశాంతి రెడ్డి.

-- అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిం చిన వేమిరెడ్డి దంపతులు.

-- ఆలయయ సాంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి కార్యనిర్వహణాధికారి ఆళ్ల శ్రీనివాసులురెడ్డి.

2020-11-06 13:26 GMT

Nellore Updates: శ్రీ చెంగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన షార్ గ్రూప్ డైరెక్టర్..

నెల్లూరు:

--- సూళ్లూరుపేట శ్రీ చెంగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన షార్ గ్రూప్ డైరెక్టర్ గోపికృష్ట..

--- పీఎస్ఎల్వి సీ-49 రాకెట్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ గోపికృష్ట పూజలు.

--- ప్రయోగానికి ముందు చెంగాలమ్మ ఆలయంలో పూజలు చేయడం ఆనవాయితీ

- రేపు మధ్యాహ్నం 3 గంటల02 నిమిషాలకు నింగిలోకి వెళ్లనున్న పీఎస్ఎల్వి సీ -49

2020-11-06 13:20 GMT

Amaravati Updates: ‘మానవత్వమే నా మతం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం వైయస్‌ జగన్..

అమరావతి..

-"మానవత్వమే నా మతం" పుస్తకాన్ని క్యాంప్‌ కార్యాలయంలో ఆవిష్కరించిన సీఎం వైయస్‌ జగన్‌

-కార్యక్రమంలో హాజరైన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్‌)   జీవీడీ కృష్ణమోహన్, ముఖ్యమంత్రి సలహాదారు(గ్రామ, వార్డు సచివాలయాలు) ఆర్.ధనంజయ్ రెడ్డి, గాంధీ పథం పక్ష పత్రిక ఎడిటర్‌ ఎన్‌.పద్మజ

2020-11-06 13:16 GMT

Tirumala-Tirupati Updates: టీటీడీ ఆధీనంలోకి బూర‌గ‌మంద‌ శ్రీ ప్ర‌స‌న్న వెంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం..

తిరుపతి..

-చిత్తూరు జిల్లా స‌దుం మండ‌లం బూర‌గ‌మంద గ్రామంలోని శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయాన్ని టీటీడీలోకి విలీనం

-రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రివ‌ర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స‌మ‌క్షంలో ఈ విలీన కార్య‌క్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

2020-11-06 13:01 GMT

Krishna District Updates: గన్నవరం మండలం గోపవరపుగూడెంలో ఘటన..

 కృష్ణాజిల్లా..

- విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి, నాలుగు కోతులు మృత్యువాత..

- విద్యుత్తు తీగలు తెగిపడటమే ప్రమాదానికి కారనం

2020-11-06 12:39 GMT

Nellore District Updates: పొదలకూరు పట్టణంలో విషాదం..

  నెల్లూరు:--

-- స్నేహితులతో తెలుగు గంగ కాలువలో ఈతకు వెళ్ళి రామిశెట్టి సునీల్ కుమార్ (19 )మృతి..

-- మృతుడు నిరుపేద భవననిర్మాణ కార్మిక కార్మికుడు పోషణ కరువైన కుటుంభం..

2020-11-06 12:37 GMT

Srikakulam District Updates: జిల్లాలో కరోనా కలకలం..

 శ్రీకాకుళం జిల్లా..

* పొందూరు మండలం తాడివలసలో భారీగా నమోదైన పాజిటివ్ కేసులు..

* ఒకే రోజులో 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..

* 42 మంది పెద్దలకు ఒక విద్యార్థికి కరోనా నిర్ధారణ..

* తరగతులకు హాజరైన వారందరికీ కొవిడ్‌ పరీక్షల నిర్వహణ..

* వివాహ వేడుక కారణంగా వైరస్‌ వ్యాప్తి జరిగినట్లు సమాచారం..

Tags:    

Similar News