హెచ్ ఆర్సీ ని ఆశ్రయించిన 2015 పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు.
కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్ .
2015 కానిస్టేబుల్ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన.
ఎన్నిసార్లు కోర్టుల చుట్టు తిరిగినా సరైన న్యాయం జరగడం లేదు.
హెచ్ ఆర్ సి అనుమతి ఇస్తే కారుణ్య మరణాలకు సిద్ధపడతాం.
*వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో పర్యటించిన టి-టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ..
రంగాపూర్ గ్రామంలో ఇటివల కురిసిన భారీ వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలన...
రాష్ట్రంలో ఎక్కవ వర్షాలు కురుస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముందె తెలుసు...
నీళ్లు నిధులు నియమకాలు అన్నాడు అంతా నిర్లక్ష్యంతో కూడిన పరిపాలనా..
నిదుల పరంగా ధనిక రాష్టాన్ని ,మిగులు రెవిన్యు రాష్టాన్ని మూడు లక్షల కోట్ల వరకు అప్పుల పాలు చేశాడు ...
కమీషన్లు కొట్టెయడంకోసమే పథకాలను తెచ్చాడు ..
రైతుల సంక్షేమ పథకాల మీద రైతులను మోసం చేస్తున్నాడు...
ఐదు లక్షల ఎగ్రేషియన్ ను రైతు బంధు గా మార్చాడు...
ఎకరాకు ముప్పై వెలు ఖర్చు పెడితే రైతుకు కూలి కూడా వచ్చేలాలేదు
రాష్ట్రంలో ఇప్పటి వరకు 15 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు ఏ ఒక్క రైతును ఓదార్చలేదు
రైతు లేనిదే రాజ్యం లేదు రైతు కళ్లల్లో నీళ్లు చూడరాదు టి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ
ములుగు
ములుగు జిల్లా కేంద్రములో గ్రామ పంచాయితీ లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం ను జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య తో కలిసి ప్రారంభించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క...
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు...
మాగంటి గోపీనాథ్.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే
#బీజేపీ నుంచి ఈరోజు పార్టీ లో చేరుతున్న ప్రతీ కార్యకర్తను కుటుంబ సభ్యులు గా చూసుకుంటాం..
#రావుల శ్రీధర్ రెడ్డి.. నేను మంచి మిత్రులం.. ఈ మధ్య కొన్ని గొడవలు అయ్యి కేసులు కూడా అయ్యాయి..
#ఇద్ధరం కాంప్రమైజ్ అయ్యి ..కేసులు విత్ డ్రా చేసుకుంటాం..
తెలంగాణ భవన్ లో
కేటీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి
#టీఆర్ఎస్ ఇంటి పార్టీ,ఎవరికి కష్టం వచ్చిన అండగా ఉండే పార్టీ టీఆర్ఎస్ అనేది నిజం..
#దేశంలో బీజేపీ, కాంగ్రెస్ లకు 28 రాష్ట్రాల్లో ఉంటే 2800 ఏజెండాలు ఉంటాయి..
#కానీ మనకు ఒకటే తెలంగాణ ఎజెండా..
#రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగిన టీఆర్ఎస్ దే గెలుపు..
#ఇప్పటికైనా ప్రతి పక్ష పార్టీ నేతలు కళ్ళు తెరవటం లేదు..
#దుబ్బాకలో మేమే గెలుస్తున్నామని. ఊకదంపుడు ఉపన్యాసాలు సోషల్ మీడియా లో చేస్తున్నారు..
#మేము చేసిన అభివృద్ధి మేము చూపిస్తాం..
#కేంద్రానికి తెలంగాణ నుంచి ఈ ఆరేళ్లలో పన్నుల రూపంలో.2 లక్షల72 వేల కోట్లు ఇచ్చాం..
#కానీ మనకు కేంద్రం నుంచి వచ్చింది లక్ష కోట్లు మాత్రమే ..
#కానీ వాళ్ళ ప్రచారం మాత్రమే మేమే ఇస్తున్నాం అంటున్నారు..
#రాష్ట్రంలో.ఇచ్చే నిధులు మొత్తం మావే అంటారు..
#ఎలక్షన్ లో.పట్టుబడిన పైసలు మాత్రం మావి కాదు అంటారు..
నోట్ల రద్దు,రైతులు వద్దు, కానీ.కార్పొరేట్ ముద్దు అనేది బీజేపీ ఎజెండా
దేశంలో కొన్ని క్వార్టర్స్ గా జీడీపీ తగ్గుతోంది..
#శ్రీలంక,బంగ్లాదేశ్ లు జీడీపీలో మనకంటే ముందున్నాయి.
#మాటలు మాత్రమే చెప్తారు..
#నల్లధనం తెస్తాం..15 లక్షలు అకౌంట్లలో వేస్తాం అన్నారు..
#నల్లధనం తేలేదు కానీ నల్ల రైతు చట్టాలు తెచ్చారు..
#వలస కార్మికులను ఆదుకోలేదు..
#కిసాన్, జవాన్ ఎవరు సుఖంగా లేరు..
#కేసీఆర్ లాంటి బలమైన నాయకుడు ఉండలని ప్రజలు కోరుకుంటున్నారు..
#కొందరు మతం పేరుతో ప్రజల్లో చిచ్చు పెడుతున్నారు..
#మతం మాకు ప్రచారాస్త్రం కాదు....మా దేశ భక్తి ప్రదర్శనకు కాదు.
#తెలంగాణ దేశంలో అగ్రశ్రేణి రాష్ట్రం గా తీర్చిదిద్దడానికి కేసీఆర్ నాయకత్వమే శరణ్యం.
మంత్రి కేటీఆర్ బీజేపీ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నారాయణపేట అంబేద్కర్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు పాల్గొన్న రాష్ట్ర నాయకులు నాగురావు నామాజి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్
Siddipet Updates: దుబ్బాక ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి...
సిద్దిపేట:
-కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఎన్నికల నిర్వహణ.
-దుబ్బాకలో 1లక్ష 98 వేల 756 ఓటర్లు ఉన్నారు.. ఎన్నికల కోసం 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు,ఎన్నికల సిబ్బంది 3600 మంది.. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి...
-89 సమస్యాత్మక ప్రాంతాలు, 33 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తింపు. ఇందులో కేంద్రాల బలగాలతో బందోబస్తు ఏర్పాటు.. మొత్తం 2 వేల మంది పోలీస్ సిబ్బంది...
-ఈ సారి కొత్తగా కోవిడ్ నిబంధనల మేరకు ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద సోషల్ డిస్టన్స్ పాటించేలా మార్కింగ్,మాస్క్ తప్పనిసరి, ఓటర్ కు గ్లౌస్ ఇచ్చేలా ఏర్పాటు...
-ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు మైక్రో అబ్బెర్వర్లు,సిసి కేమెరా , వీడియో గ్రాఫిలు ఏర్పాటు.
-మొదటి సారి ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ అవకాశం,80 సంవత్సరాలు, దివ్యంగులు ,కోవిడ్ రోగుల కోసం పోస్టల్ బ్యాలెట్..
Saraswati Barrage Updates: సరస్వతి బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
-3 గేట్లు ఎత్తిన అధికారులు
-పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 118.100 మీటర్లు
-పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
-ప్రస్తుత సామర్థ్యం 8.77 టీఎంసీ
-ఇన్ ఫ్లో 5,700 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో 4,500 క్యూసెక్కులు
Warangal Urban Updates: నేడు TSICET 2020 పలితాల విడుదల!
వరంగల్ అర్బన్..
-నేడు TSICET 2020 పలితాలను సాయంత్రం 3.00 గంటలకు కాకతీయ విశ్వవిద్యాలయ కామర్స్ కళాశాల సెమినార్ హాల్ నందు తెలంగాణా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య టి పాపి రెడ్డి విడుదల చేస్తారని TSICET 2020 చైర్మన్ ఆచార్య కే రాజి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
-ఈ కార్యక్రమం లో ఇన్చార్జ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ బి జనార్ధన్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే పురుషోత్తం పాల్గొంటారు.
Warangal Urban Updates: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ & మ్యుటేషన్ ప్రక్రియ ప్రారంభం..
వరంగల్ అర్బన్ ః
# నేటి నుండి తహసిల్దారు కార్యాలయంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ & మ్యుటేషన్ ప్రక్రియ ప్రారంభం..
# అరగంటకు ఒకటి చొప్పున ఇలా రోజుకు ఆరు రిజిస్ట్రేషన్ లను చేయనున్న ప్రభుత్వం...
# 55 రోజుల తర్వాత ప్రారంభం అవుతున్న రిజిస్ట్రేషన్స్..