Live Updates: ఈరోజు (02 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 02 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 02 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | విదియ రా.11-01 తదుపరి తదియ | కృత్తిక నక్షత్రం రా.10-50 తదుపరి రోహిణి | వర్జ్యం ఉ.9-38 నుంచి 11-24 వరకు | అమృత ఘడియలు రా.8-11 నుంచి 9-56 వరకు | దుర్ముహూర్తం మ.12-06 నుంచి 12-52 వరకు తిరిగి మ.2-23 నుంచి 3-09 వరకు | రాహుకాలం ఉ.7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.06-02 | సూర్యాస్తమయం: సా.05-26
ఈరోజు తాజా వార్తలు
వరంగల్ అర్బన్:
-వరంగల్ లోని సామిల్స్ పై అటవీశాఖ అధికారుల దాడులు..
-అరేపెల్లి లోని లైసెన్స్ లేని ఇబ్రహీం సామిల్ ను సీజ్ చేసిన అటవీశాఖ అధికారులు.
- hmtv తో ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణ బాబు
- ఇరు రాష్ట్రాల అంతరాష్ట్ర ఒప్పందం ముందుగా ఆర్టీసీ బస్సులతో ప్రారంభమైంది త్వరలోనే గూడ్స్ కూడా ఒప్పందం చేసుకుంటాం...
- ప్రస్తుతం ఓఅర్ తక్కువగా ఉన్నందున కొన్ని సర్వీసులు మాత్రమే నడిపిస్తున్నాం...
- లక్షా కిలోమీటర్ల పై ప్రయివేటు వాహనాలు చోటు ఇవ్వకుండా ప్రయాణికులను బట్టి ఇరు రాష్ట్రాలు మాట్లాడుకుంటాం...
- ఈ ఏడూ నెలల కాలంలో దాదాపు 2400 కోట్ల రెవెన్యూ నష్టం ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కి వచ్చింది...
- నష్టాన్ని ప్రజలపై భారంగా వేయలేము..
- ఇవాళ రాత్రి నుండే ఇరు రాష్ట్రాల మధ్య బస్సులు ప్రారంభమవుతాయి..
- ప్రస్తుతం అవసరాన్ని బట్టి మాత్రమే బస్సులు నడుస్తాయి...
హైదరాబాద్..
* ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ ముందు దిశ నిందితుల కుటుంబ సభ్యులు ధర్నా...
* దిశ ఎన్ కౌంటర్ సినిమా లో తమ వారిని విలన్ గా చిత్రీకరించారని ఆరోపిస్తున్న దిశా నిందితుల కుటుంబ సభ్యులు...
* సినిమాను నిలిపివేయాలంటూ డిమాండ్ చేస్తున్న దిశ నిందితుల కుటుంబ సభ్యులు
మహబూబాబాద్ జిల్లా...
* డోర్నకల్ మండల కేంద్రంలో ఫోర్జరీ పత్రాలతో కల్యాణ లక్ష్మీ పధకంలో డబ్బులు కాజేయలని చూసిన ఇద్దరి వ్యక్తుల అరెస్ట్, ఫోర్జరీకి ఉపయోగించిన స్టాంపులు, కలర్ ప్రింటర్, కంప్యూటర్ స్వాధీనం.
* మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన...ఎస్పీ కోటి రెడ్డి...
హైదరాబాద్
*పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ తో ముగిసిన ఏపీ రైతుసంఘం నేతల సమావేశం..
*వడ్డే శోభానాదీశ్వర్ రావు , మాజీమంత్రి
*పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కోరాం
*విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మాణం పూర్తిగా చేస్తామనీ కేంద్రం పేర్కొంది
*2013-14 అంచనాల ప్రకారం ఇస్తామని చెప్పడం ఏపీ ప్రజలపై పిడుగు పడ్డ పరిస్థితి
*లేకపోతే 13 జిల్లా లో పెద్ద ఎత్తున నిరసనలు వెళ్లువెత్తుతాయి
*రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
*పోలవరం జాతీయ ప్రాజెక్టు కనుక నిధులు మొత్తం కేంద్రమే భరించాలి.
*ఏపీలో అన్ని పక్షాలు ఏకమై ఢిల్లీ పై ఒత్తిడి తీసుకురావాలి.
*రాజకీయ విభేదాలు ఉంటే ఇక్కడ చూసుకోవాలి.
*సీఎం జగన్ వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీ పై ఒత్తిడి తీసుకురావాలి.
*పోలవరం ప్రాజెక్టు అథారిటీ చైర్మన్ సానుకూలంగా స్పందించారు
ఆదిలాబాద్ జిల్లా..
- ఐటీడీఏ ఆద్వర్యంలో గ్రామీణ రవాణా, ఎంపవర్ మెంట్, గిరి వికాసం మరియు సి.సి.డి.పి ఆస్తుల పంపిణీ
- చేసిన మంత్రి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్న . జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్థన్
సంగారెడ్డి జిల్లా..
-6సంవత్సరాల దళిత బాలిక పై అత్యాచారం.
-ఇంట్లో ఎవరు లేని సమయంలో 15సంవత్సరాల బాలుడు ,ఇంట్లో చొరబడి దళిత బాలిక పై అత్యాచారం.
-పోలీసుల అదుపులో నిందితుడు.
-చికిత్స నిమిత్తం ఆస్పత్రికి బాలికను తరలించిన పోలీసులు.
డా.. దాసోజు శ్రవణ్
ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి.
కైలాష్ కుమార్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి. ప్రెస్మీట్, గాంధీ భవన్
మేము డిమాండ్ చేసినట్లు పరిహారం ఇవ్వలేదు
వరద బాధిత కుటుంబాలకు 10 వేలు లెక్కన ఇస్తామన్నారు
అందులో కూడా....తెరాస నాయకులు, GHMC అధికారులు భోక్కేశారు
పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది
గ్రేటర్ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలి
వరద సహాయ నిధులను దోచుకు తిన్నారు
వరద బాధితులను కూడా వదలరా !
కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడంలో కూడా కక్కుర్తి పడ్డారు
550 కోట్లు రూపాయల మొత్తం ఎలా నగదు తీసుకోగలిగారు
రాజకీయాలకు అతీతంగా బాధితులకు పంపిణీ చెయ్యాల్సి ఉంది
ఒక్కో కార్పొరేట్ ర్.....10 లక్షల వరకు దండుకున్నారు
నష్టానికి చెంది ప్రభుత్వం అంచనాలు రూపొందించాలి
పిల్ గా స్వీకరించాలని కోరుతూ నేను పూర్తి వివరాలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాను
వరద సహాయం.... పంపిణీలో జరుగుతున్న అవకతవకలపై ప్రజా ప్రయోజనాల పిటీషన్ వేసాను
బుద్ధ భవన్ లో ఎన్నికల ప్రధానాధికారిని కలసిన బీజేపీ నేతలు ప్రేమేందర్ రెడ్డి, ఆంటోని రెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటరు నమోదు గడువును పెంచాలని విజ్ఞప్తి.
మినిష్టర్ క్వార్టర్స్ లో...మాజీ హోమ్ మంత్రి, దివంగత నేత నాయిని నరసింహారెడ్డి దశదిన కర్మకు హాజరై...నివాళులు అర్పించిన రాజ్యసభ సభ్యులు డీ.యస్
డీ.శ్రీనివాస్ కామెంట్స్...
ఒక గొప్ప రాజకీయ నేతను కోల్పోయాము....నాయిని అంటే...తెలంగాణ ఉద్యమానికి, ట్రేడ్ యూనియన్ల పోరాటాలకి పెట్టింది పేరు...
ఆయన బులెట్ బండి మీద వస్తుంటే, ఒక పులి లాగా అనిపించేది...
ఆయనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు...చివరి రోజుల్లో అసంతృప్తితో చాలా భాద పడ్డారు...
వయసులో నాకన్నా పెద్దవాడు అయినా కూడా, నన్ను అన్నా అని ఆప్యాయంగా పిలిచేది...
ఆయన చనిపోయిన 4 రోజులకే ఆయన సతీమణి చనిపోవడం ఆ కుటుంబానికి తీరని లోటు...
ఆ ఆదర్శ దంపతులు ఎక్కడ ఉన్నా, వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్న...