నంద్యాల లోక్ సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్న ఎస్.పి.వై.రెడ్డి గారు మరణం చాలా బాధాకరం.
వారి కుటుంబానికి నా తరఫున, జన సైనికుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
రాజకీయాల్లో హుందాతనం పాటించిన నాయకుడు ఎస్.పి.వై.రెడ్డి గారు.
విద్యావంతుడు, శాస్త్ర పరిజ్ఞానం ఉన్న ఆయన పారిశ్రామికవేత్తగా ఎన్నో విజయాలు సాధించడం, సామాజిక సేవలో నిమగ్నమైన తీరు, కరవు ప్రాంతాల్లో ప్రజలకు అందించిన చేయూత ఎన్నదగినవి. రాజకీయాల్లోకి రాకముందే పేదల ఆకలి తీరేలా రెండు రూపాయలకే ఆహారం అందించే కేంద్రాలు నెలకొల్పిన ఎస్.పి.వై.రెడ్డి గారు మూడు దఫాలు లోక్ సభ సభ్యుడిగా నిరుపమానమైన సేవలందించారు.
జనసేన పార్టీలోకి వచ్చినప్పుడు ఎస్.పి.వై.రెడ్డి గారు అనుభవం, సేవాతత్పరత సమాజానికి ఎంతో దోహదపడుతాయని మనస్ఫూర్తిగా ఆహ్వానించాను.
నంద్యాల లోక్ సభ స్థానం నుంచి పోటీకి నిలిపాం.
ఎస్.పి.వై.రెడ్డి గారు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.