US-Canada Merger: అమెరికాలో కెనడా విలీనానికి డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన... ఇది ఎవరికి ఎక్కువ లాభం?

Update: 2025-01-07 11:15 GMT

కెనడాను అమెరికాలో విలీనానికి డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన

Donald Trump about US-Canada Merger: కెనడా ప్రధాని జస్టిన్ ట్రోడో తన పదవికి రాజీనామా చేశారు. మీరు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా కెనడాలో అధికార పార్టీపై వ్యతిరేకత పెరిగిపోతోందని లిబరల్ పార్టీ జస్టిన్ ట్రూడోపై ఒత్తిడి పెంచుతోంది. దీంతో ఆయనకు చివరకు ఆ పదవి నుండి దిగిపోక తప్పలేదు. అయితే, కెనడాలో పరిస్థితి ఇలా ఉంటే అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన పాత ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. కెనడాను అమెరికాలో కలిపేసి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 51వ రాష్ట్రం చేస్తే బాగుంటుందని ట్రంప్ ప్రతిపాదిస్తున్నారు.

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పదవికి రాజీనామా చేసిన తరువాత కొన్ని గంటల్లోనే డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ట్రూత్ సోషల్ అనే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా ట్రంప్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కెనడాలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోందన్నారు. కెనడాలో చాలామందికి తమ దేశాన్ని అమెరికాలో విలీనం చేయాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. ట్రూడోకు కూడా ఈ విషయం తెలిసని ట్రంప్ తెలిపారు.

కెనడాను అమెరికాలో కలిపితే ఏమవుతుంది, ఎవరికి లాభం?

కెనడాను అమెరికాలో కలపడం వల్ల కెనడానే లాభపడుతుందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికాలో విలీనం అవడంతోనే వారికి పన్నుల బెడద తప్పిపోతుందన్నారు. అంతేకాదు... కెనడా చుట్టూ చక్కర్లు కొడుతోన్న రష్యా, చైనా ఓడల నుండి కూడా కెనడాకు ఒక టెన్షన్ తప్పుతుందన్నారు. ఏదేమైనా అమెరికా, కెనడా కలిసిపోతే చూడ్డానికి ఆ దేశం ఎంత గొప్పగా ఉంటుందో అని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

కెనడాను అమెరికాలో విలీనం చేయాలన్న ట్రంప్ ప్రతిపాదన ఇప్పుడు కొత్తది కాదు. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఆయన జస్టిన్ ట్రూడోను కలిశారు. అప్పుడే ట్రంప్ ఈ ప్రతిపాదన చేశారు (Donald Trump about US-Canada merger). 

Tags:    

Similar News