Bashar al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడు అస్సాద్‌పై రష్యాలో విష ప్రయోగం ..పరిస్థితి విషమం

Update: 2025-01-03 00:18 GMT

Bashar al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడు, నియంత బషర్ అల్ అసద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆదివారం అతను తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. మాస్కోలో ఆయనపై విష ప్రయోగం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన తీవ్ర దగ్గుతోపాటు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. మీడియా కథనాల ప్రకారం, అసద్ విషప్రయోగం జరిగినట్లు చెబుతున్నాయి. అయితే అసద్ ఆరోగ్యంపై ఇప్పటి వరకు రష్యా స్పందించలేదు. వైద్య టెస్టుల్లో మాత్రం విషం ఉన్నట్లు స్పష్టం అయ్యింది. ప్రస్తుతం ఆయన ఉంటున్న అపార్ట్ మెంట్ లోనే చికిత్స పొందుతున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

ఈమధ్యే సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లింది. రెబల్స్, డెమాస్కస్ ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో అసద్ కుటుంబంతో కలిసి డిసెంబర్ 8, 2024న రష్యాకు పారిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ రాజకీయ శరణార్థిగా ఉంటున్నారు. అయితే అసద్ భార్య అస్మా పరిస్థితి కూడా సీరియస్ గా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. 50-50 శాతం మాత్రమే ఛాన్స్ ఉందని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె సొంత దేశమైన యూకేకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. భర్తకు విడాకులు ఇచ్చి యూకేకు వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంతలోనే అసద్ పై విషప్రయోగం జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది.

అయితే ఆమెకు ఆశ్రయం ఇవ్వడానికి బ్రిటన్ నిరాకరించింది. అస్మా పాస్‌పోర్ట్ గడువు ముగిసింది .ఆమె తన భర్తతో పాటు సిరియా ప్రజలపై మారణహోమానికి పాల్పడ్డారని ఆరోపించారు. అస్మా, ఆమె కుటుంబం ప్రస్తుతం మాస్కోలో ప్రవాసంలో నివసిస్తున్నారు.వీరి కుటుంబం 50 ఏళ్లకు పైగా సిరియాను పాలించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆయనకు ఆశ్రయం కల్పించారు.

Tags:    

Similar News