China Solar Great Wall Building Project: సోలార్ గ్రేట్ వాల్ చైనా మరో అద్బుతం
సోలార్ గ్రేట్ వాల్ నిర్మాణ (Solar Grate wall) పనులు చైనా(China)ప్రారంభించింది.కబుకీ ఎడారిలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. 100 గిగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో సోలార్ విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు.400 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పుతో దీన్ని నిర్మిస్తారు. బీజింగ్ నగర అవసరాలకు అవసరమయ్యే విద్యుత్ కోసం ఈ సోలార్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇప్పటికే 5.4 గిగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసే సోలార్ ప్యానెల్స్ (solar Panel)అమర్చారు. సోలార్ గ్రేట్ వాల్ నిర్మాణ పనులు 2023లో పూర్తి కానున్నాయి.
కబుకి ఎడారిలో సోలార్ ప్లాంట్
కబుకి ఎడారిలో సోలార్ గ్రేట్ వాల్ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఇక్కడ ఎండ వాతావరణం ఉంటుంది. పారిశ్రామిక కేంద్రాలకు దగ్గరగా కూడా ఇది ఉంటుంది. బాటౌ, బయన్నూర్ నగరాల మధ్య ఇరుకైన దిబ్బల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నారు.పరిగెత్తె గుర్రం ఆకారంలో జున్మా సోలార్ పవర్ స్టేషన్ ను నిర్మించింది. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్యానెల్స్ ఇమేజ్ గా ఇది రికార్డు సృష్టించింది. ఇది ఏటా 200 కోట్ల కిలోవాట్ పర్ అవర్ విద్యుత్తు ఉత్పత్తి చేయగలదు. ఇది 4 లక్షల మంది ప్రజల అవసరాలను ఇది తీర్చగలదు.
చైనా సోలార్ ప్లాంట్ చిత్రాలను తీసిన ల్యాండ్ శాట్ ఉపగ్రహాలు
ఇన్నర్ మంగోలియాలోని కబుకీ ఎడారిలో సోలార్ గ్రేట్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.సోలార్ ప్యానెళ్ల కారణంగా ఫోటోవాల్టిక్ సముద్రంగా ఈ ప్రాంతం మారిపోయిందని నాసా ఎర్త్ అబ్జర్వేటరీ ఒకరు అన్నారు.నాసాకు చెందిన ల్యాండ్ శాట్ 8,9 ఉపగ్రహాలు ఇక్కడి పరిస్థితిని చిత్రీకరించాయి.
సోలార్ ద్వారా 3 కోట్ల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
ప్రస్తుతం చైనా సోలార్ విద్యుత్ సంస్థలు మొత్తం కలిపి 3, 86,875 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఇది ప్రపంచంలోని మొత్తం సామర్ధ్యంలో సగానికి సమానం. ఆ తర్వాతి స్థానంలో అమెరికా 79,364 మెగావాట్లను ఉత్పత్తి చేయగలదు. 53,114 మెగావాట్లతో భారతదేశం ఉంది.2017, 2023 మధ్య కార్యాచరణ సౌర సామర్థ్యం సంవత్సరానికి సగటున 39,994 మెగావాట్లు పెరిగింది.